YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

క‌రోనా ముంభయం

క‌రోనా ముంభయం

క‌రోనా ముంభయం
ముంబై, ఏప్రిల్ 20
ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ కార‌ణంగా మ‌హారాష్ట్ర అల్లాడుతున్న‌ సంగ‌తి తెలిసిందే. పెద్ద‌యెత్తున పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 552 కేసులు న‌మోద‌య్యాయ‌ని అధికారులు తెలిపారు. మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజు న‌మోదైన కేసుల్లో అత్య‌ధికం ఈ రోజే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో మ‌హారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 4200 చేరింది. అలాగే ఈ వ్యాధి కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు 223 మంది మ‌ర‌ణించారు.మొత్తంమీద ఆ రాష్ట్రంలో ప్ర‌స్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,470గా ఉంది. ఆదివారం 142 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 507కు చేరింది. అలాగే తాజాగా 12 మంది ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌ర‌ణించారు. మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా రాజధాని ముంబైలో వైర‌స్ ప్ర‌భావం అధికంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు రెండు వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.ఇక దేశ‌వ్యాప్తంగా మ‌హారాష్ట్ర త‌ర్వాత ఢిల్లీలో అత్య‌ధిక సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు 2000కుపైగా పాజిటివ్ కేసులు రికార్డ‌య్యాయి. 45 మంది మృత్యువాత ప‌డ్డారు. మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా వెయ్యి పాజిటివ్ కేసుల సంఖ్య దాటిన రాష్ట్రాల్లో గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు ఉన్నాయి.

Related Posts