YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ వాస్తు కోసమే వెనుక చక్రం తీసేశారా,,,

జగన్ వాస్తు కోసమే వెనుక చక్రం తీసేశారా,,,

జగన్ వాస్తు కోసమే వెనుక చక్రం తీసేశారా,,,
విజయవాడ, ఏప్రిల్ 20
జగన్ క్రైస్తవ మతాన్ని పూర్తిగా విశ్వసిస్తారు. ఆయనకు జాతకాలు, వాస్తుశాస్త్ర పట్టింపులు అసలు లేవు. కానీ 2014 ఎన్నికల్లో ఓడాక జగన్ కొంత మెత్తబడ్డారు. హిందువులను మచ్చిక చేసుకోవడానికి పీఠాధిపతులు, స్వాములను ఆశ్రయించారు. దాంతో పాటు జాతకాల మీద ఆయనకు గురి కుదిరింది. దాంతో ప్రతీదానికీ ముహూర్తాలు పెట్టించుకుని మరీ ముందుకు కదిలేవారు. ఇపుడు చూస్తే జగన్ వాస్తు శాస్త్రం పట్ల కూడా మోజు పెంచుకుంటున్నారుట. బంపర్ మెజారిటీతో అధికారం దక్కినా కూడా పది నెలల పాలన మాత్రం కష్టాలతోనే సాగుతోంది. దాంతో జగన్ అర్జంట్ గానే వాస్తు మీద దృష్టి పెట్టారని అంటున్నారు.పదేళ్ళ పాటు అధికార వియోగం అనుభవించిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన జరిగాక కానీ ముఖ్యమంత్రి సీటు అందుకోలేకపోయారు. ఆ దూకుడులో చంద్రబాబు ఉమ్మడి ఏపీలో తన ఆఫీసుకు ఎన్నో మార్పులు వాస్తుని అనుసరించి చేయించారు. ఆ తరువాత అమరావతికి షిఫ్ట్ అయిన తరువాత అక్కడ కూడా మార్పులు చేర్పులు భారీగా జరిగాయి. అలా ముఖ్యమంత్రి సచివాలయం ఆఫీసులో ముఖ్యమంత్రి సీటు వెనక బంగారు వన్నెల చక్రం వెలిసింది. దీన్ని సూచించిన కొంతమంది వాస్తు పండితులు బాబుకు ఇక‌ ఎదురులేదని కూడా చెప్పారు. కానీ చిత్రంగా బాబు గత ఏడాది జరిగిన ఎనికల్లో ఓడిపోయారు.ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకూ ఆ చక్రం అలాగే ఉంది. జగన్ సైతం దాన్ని పట్టించుకోకుండా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే అక్కడ తీసుకున్న ప్రతీ నిర్ణయం ఎదురుతంతోంది. అంతే కాదు. పది నెలల్లోనే పుట్టెడు కష్టాలు కలసి వచ్చి మరీ జగన్ ని పలకరించాయి. ఏపీకి అర్ధికంగా కొత్తగా రూపాయి రాకపోతే పోనీ కానీ జీరో స్థాయికి సీన్ తెచ్చేస్తూ కరోనా మహమ్మారి వీర విహారం చేస్తోంది. దానికి తోడు అనుకున్న పనులు జరగకపోవడం, అనేక రకాలైన చికాకులతో జగన్ సతమతమవుతున్నారు. దాంతో తన సీటు వెనక ఉన్న చక్రమే అన్నింటికీ అడ్డు తగులుతోందని భావించిన జగన్ వాస్తు పండితుల సలహాతో దాన్ని తొలగించేశారుట.ఇపుడు కేవలం జగన్ సీఎం కుర్చీ వెనక ఏపీ చిహ్నం మాత్రమే కనిపిస్తాయి. దాంతో చూడడానికి మాత్రం ప్రశాంతంగా ఉందిట. మరి ఈ మార్పుల వల్లనైనా ఏదైనా మేలు ఏపీకి జరుగుతుందా అన్నది చూడాలి. జగన్ మాత్రం మరిన్ని భారీ మార్పులకు కూడా సిధ్ధపడుతున్నారుట. ఈ మేరకు ఆయన వాస్తుపండితుల సలహా సూచనలు పాటిస్తున్నారని చెబుతున్నారు. చూడాలి జగన్ అధికార‌ చక్రం కొత్త మార్పులతోనైనా వేగంగా తిరుగుతుందా లేదా అన్నది.
 

Related Posts