YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

అధికారులను అడ్డుకున్న స్థానికులు..బాకికేడ్ల ధ్వంసం

అధికారులను అడ్డుకున్న స్థానికులు..బాకికేడ్ల ధ్వంసం

అధికారులను అడ్డుకున్న స్థానికులు..బాకికేడ్ల ధ్వంసం
బెంగళూరు ఏప్రిల్ 20
కర్నాటకలోని బెంగళూరులో హెల్త్ వర్కర్లు, పోలీసులు, అధికారులపై స్థానికులు దాడికి దిగారు. టిన్ షీట్లు, బారికేడ్లను తొలగించారు. బెంగళూరు సమీపంలో పండ్రాయపురాలో ఈ ఘటన జరిగింది. 18 కరోనా కేసులు నమోదు కావడంతో ఈ ఏరియాను ఇదివరకే రెడ్ జోన్ గా ప్రకటించి సీల్ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ కు వెళ్లొచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో వారితో కాంటాక్ట్ అయినవారిని అధికారులు గుర్తించారు. వారందర్నీ క్వారంటైన్ కు తరలించేందుకు ఆదివారం రాత్రి 7 గంటలకు హెల్త్ వర్కర్లు, పోలీసులు, అధికారుల టీమ్ చేరుకుంది. 200 మంది స్థానికులు వారిని అడ్డుకున్నారు. స్పాట్ లోనే టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో టిన్ షీట్లు, బారికేడ్లను తొలగించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Related Posts