YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కేటీపీఎస్ లో భారీ చోరీ

కేటీపీఎస్ లో భారీ చోరీ

కేటీపీఎస్ లో భారీ చోరీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పాల్వంచ కేటిపిఎస్ కర్మాగారం లోని స్టోర్ లో విలువైన సామాగ్రి కనిపించడం లేదని జెన్కో అధికారులు గుర్తించారు. సుమారు 30 లక్షల విలువ చేసే ప్రైమరీ ఎయిర్ ఫ్యాన్ లు,  వాటికి సంబంధించిన బ్లేడ్ లు మాయం అయినట్టు గుర్తించారు. దీంతో హైదరాబాద్ నుంచి విజిలెన్స్ ఎస్పీ వినోద్ కుమార్ హుటాహుటిన పాల్వంచ కేటిపిఎస్ కర్మాగారానికి చేరుకొని అక్కడి ఏ ఏ సామాగ్రి చోరీ కి గురైంది అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా కేటిపిఎస్ కర్మాగారం నుండి ఇనుము దొంగతనాలకు పాల్పడితే ఇద్దరి ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఈ మధ్య కాలంలో కూడా యాష్ పాండ్ నుంచి ఐరన్ పైప్ లు దొంగిలించి ఓ స్క్రాప్ దుకాణం లో లారీ లో లోడ్ చేస్తూ పట్టుబడిన సంఘటన లు మరవకముందే ఈ రోజు ముప్పై లక్షల విలువ గల సామాగ్రి చోరీ కి గురవడం విస్మయం కలిగిస్తోంది. కర్మాగారం సమీపంలో విచ్చలవిడిగా స్క్రాప్ దుకాణాలు వెలిశాయి. రాత్రి కి రాత్రే ఇనుము దొంగలించడం లారీ లలో లోడ్ చేసి ఇతర ప్రాంతాలకు పంపిస్తూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్ఆయి. కేటిపిఎస్ కర్మాగారం లో చోరీ జరిగినప్పుడు తూతూ మంత్రం గా అధికారులు అప్పుటికప్పుడే హడావిడి చెయడం తర్వాత ఆ చోరీ గురించి మరచిపోయిన  సంఘటన లు కుడా వున్నాయి. చోరీ జరిగిన స్టోర్ ను పాల్వంచ డిఎస్పీ కె.ఆర్.కె.ప్రసాద్, సి.ఐ నవీన్, ఎస్సై ప్రవీణ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, కొంతమంది అనుమానితులను   అదుపులో తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

Related Posts