YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎల్లుండి ‘భరత్ అనే నేను’ బహిరంగసభ!!

ఎల్లుండి ‘భరత్ అనే నేను’  బహిరంగసభ!!

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ మూవీ విడుదల తేదీని ఖరారు చేసుకోవడంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ప్రిన్స్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. భరత్ అనే నేను’ సినిమా చివరి షెడ్యూల్ స్పెయిన్‌లో పూర్తి చేసుకుంది. స్పెయిన్‌లో ఈ మూవీలోని కీలక సన్నివేశాలతో పాటు మేజర్ పార్ట్ సాంగ్స్‌ని కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఆధ్వర్యంలో చిత్రీకరణ జరుపుకుందిభారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల - మహేష్ కాంబినేషన్ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీలో మహేష్‌బాబు ముఖ్యమంత్రిగా నటిస్తుండటం ఈ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.  మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ‘భరత్ బహిరంగ సభ’ పేరుతో ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్ బి స్టేడియంలో వైభవంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లలలో నిమగ్నమైంది చిత్ర యూనిట్. ఈ బిగ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథులుగా హాజరౌతున్నట్లు సమాచారం. 

Related Posts