YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఆరువేల కోట్లకు టీం ఇండియా రైట్స్

ఆరువేల కోట్లకు టీం ఇండియా రైట్స్

వచ్చే ఐదేళ్లపాటు టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల ప్రసార హక్కులను స్టార్ ఇండియా తిరిగి దక్కించుకుంది. సోనీ, రిలయన్స్ జియో నుంచి తీవ్ర పోటీ ఎదురైనా.. భారీ మొత్తాన్ని వెచ్చించి మరీ.. స్టార్ ఇండియా బీసీసీఐ మీడియా హక్కులను కొనుగోలు చేసింది.టీం ఇండియా ఆడనున్న క్రికెట్ మ్యాచ్‌లను టెలివిజన్, డిజిటల్ మాద్యమాల్లో ప్రసారం చేసే హక్కులను భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. దీని కోసం తొలిసారిగా బీసీసీఐ ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించింది. ఈ వేలంలో సోనీ స్పోర్ట్స్, స్టార్ ఇండియా, రిలయన్స్ సంస్థలు పాల్గొన్నాయి. అయితే ఈ వేలంలో ఈ హక్కులను రూ.6,138 కోట్లకు స్టార్ ఇండియా దక్కించుకుంది 2018-23 మధ్య భారత క్రికెట్ జట్టు ఆడబోయే మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి స్టార్ ఇండియా బీసీసీఐకి రూ.6138.1 కోట్లు చెల్లించనుంది. అంటే సగటున ఒక్కో మ్యాచ్‌కి మీడియా రైట్స్ రూపంలోనే బీసీసీఐకి రూ. 60 కోట్లు లభించనున్నాయి.గత ఐదేళ్లతో పోలిస్తే.. బీసీసీఐ రాబడి 59.39 శాతం పెరగనుంది. 2012-18 మధ్య కాలానికి భారత మ్యాచ్‌ల ప్రసారానికి స్టార్ ఇండియా రూ. 3851 కోట్లు చెల్లించింది. ఏప్రిల్ 15 నుంచి 2023 మార్చి 31 వరకు స్టార్ ఇండియా టీమిండియా ఆడే మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. ఈ ఐదేళ్ల కాలంలో భారత్ అన్ని ఫార్మాట్లు కలుపుకొని 102 మ్యాచ్‌లు ఆడనుంది. గత ఏడాది సెప్టెంబర్లో ఐపీఎల్ ప్రసార హక్కులను కూడా స్టార్ ఇండియా దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2018-22 మధ్య కాలానికి స్టార్ ఇండియా ఏకంగా రూ.16,347.5 కోట్ల బిడ్ దాఖలు చేసింది. 2012లో భారత్ ఆడే మ్యాచ్‌ల కోసం స్టార్ ఇండియా రూ.3851 కోట్లకు బిడ్ వేయగా.. సోనీ రూ. 3700 కోట్లు బిడ్ వేసి కొద్ది తేడాలో ప్రసార హక్కులను కోల్పోయింది

Related Posts