లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై, ఏప్రిల్ 20
శీ స్టాక్ మార్కెట్ లాభాలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం పైకి కదిలాయి. దీంతో మార్కెట్ 3 రోజులుగా లాభపడుతూనే వస్తున్నట్లు అయ్యింది. సూచీలు రోజంతా తీవ్ర ఊగిసలాటకు గురయ్యాయి. చివరకు మార్కెట్ లాభాలు చాలా వరకు హరించుకుపోయాయి.ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 468 పాయింట్లు లాభపడింది. 32,056 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 9391 పాయింట్ల గరిష్టానికి చేరింది. చివరకు సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 31,648 పాయింట్ల వద్ద, నిఫ్టీ 0.2 పాయింటు లాభంతో 9267 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
✺ నిఫ్టీ 50లో టాటా మోటార్స్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్ 4 శాతానికి పైగా పెరిగింది.
✺ అదేసమయంలో హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోయాయి. హిందాల్కో 6 శాతం క్షీణించింది.
✺ నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగానే క్లోజయ్యాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతానికి పైగా లాభపడింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3 శాతానికి పైగా పడిపోయింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. 13 పైసలు నష్టంతో 76.54 వద్ద కదలాడుతోంది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 3.74 శాతం తగ్గుదలతో 27.05 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 9.03 శాతం క్షీణతతో 22.79 డాలర్లకు తగ్గింది.
============================