YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

సాధువుల హత్య..ఒత్తిడిలో మహా సర్కార్

సాధువుల హత్య..ఒత్తిడిలో మహా సర్కార్

సాధువుల హత్య..ఒత్తిడిలో మహా సర్కార్
ముంబై, ఏప్రిల్ 20
కరోనా కట్టడి కోసం ఓ వైపు దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతుంటే.. మరోవైపు మహారాష్ట్రలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. పాలిఘర్‌లో ఈ నెల 16వ తేదీన ఇద్దరు సాధువులు తమ గురువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఓ వాహనంలో డ్రైవర్‌తో కలిసి వెళ్తున్నారు. వారిని గమనించిన కొందరు వాహనాన్ని అడ్డుకుని ముగ్గురుని బయటకు లాగి తీవ్రంగా కొట్టి చంపేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కూడా మూకను అడ్డుకోలేక నిశ్చేష్టులై చూశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మహారాష్ట్రలో ప్రకంపనలు రేపాయి. మత విద్వేషాలతోనే సాధువులను హత్య చేసినట్లు పుకార్లు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.ఈ ఘటనకు కారణమైన 110 మందిని పాల్‌ఘర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 9 మంది మైనర్లు కూడా ఉన్నారు. వారిని జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. నిందితులందరినీ ఏప్రిల్ 30 వరకూ పోలీసుల తమ కస్టడీలోనే ఉంచనున్నారు. సాధువుల హత్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనకు ఫోన్ చేశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెప్పారు. ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టొద్దని వారు చెప్పినట్లు ఉద్ధవ్ వెల్లడించారు. ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. దీనిలో హిందు, ముస్లిం వివాదం లేదని క్లారిటీ ఇచ్చారు. దొంగలంటూ పుకార్లు రావడం వల్లే సాధువులపై దాడి జరిగిందని, ఘటనను రాజకీయం చేయవద్దని ఉద్ధవ్ కోరారు.మరోవైపు పాల్‌ఘర్‌లో సాధువులపై జరిగిన దాడిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు విధించాలని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అనేక హిందూ సంఘాలు కూడా ఈ ఘటనపై మండిపడుతున్నాయి. దీంతో ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎటువంటి వివక్ష లేకుండా కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

Related Posts