YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శారదా పీఠం పవర్ తగ్గిందా

శారదా పీఠం పవర్ తగ్గిందా

శారదా పీఠం పవర్ తగ్గిందా
విశాఖపట్టణం, ఏప్రిల్ 21,
ఆయన పేరుకు పీఠాధిపతి కానీ అంతకు మించి అని కూడా అంటారు. ఇక రాజకీయాల్లో వేలూ కాలూ పెట్టడం ఆయనకు అలవాటు. ఆ విధంగా చురుకైన పాత్ర నిర్వహించే స్వామీజీలు బహుశా వేరెవరూ లేరేమో. ఆయనే విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ. ఆయన ఎందుకో మొదటి నుంచి యాంటీ టీడీపీ విధానానికే కట్టుబడ్డారు. ఇక 2014 ఎన్నికల వేళ మాత్రం తటస్థంగా వ్యవహరించారు. ఆ తరువాత జగన్ ఆయనకు సన్నిహితం కావడంతో వైసీపీలో ఆయనకు సమున్నత స్థానం దక్కింది. జగన్ కి ఓ విధంగా రాజగురువుగా పేరు తెచ్చుకున్నారు.ఎంతలా అంటే జగన్ బయటకు అడుగుపెడితే స్వామీజీయే ముహూర్తం పెట్టాలి. జగన్ జాతకం మొత్తం చూసిన ఆయన రాజయోగం ఉందని ముందే చెప్పేశారు. దానికి తగ్గట్టుగా జగన్ ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా వివరించారు. ఇక జగన్ పాదయాత్రకు సంబంధించిన ముహూర్తం దగ్గర నుంచి ఎన్నికల్లో అభ్యర్ధుల ప్రకటన. నామినేషన్లకు కూడా ముహూర్తాలు పెట్టారు. అంతేనా జగన్ సీఎంగా పదవీ ప్రమాణ ముహూర్తాన్ని స్వామిజీయే పెట్టారు. ఆ తరువాత ఏ పని చేయాలన్న కూడా జగన్ ఆయన్ని మొదట్లో సంప్రదించేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి.ఇక మూడు రాజధానుల ముచ్చట కూడా స్వామీజీ చెవిన వేశాకే జగన్ అమలుకు సిధ్ధపడ్డారని అంటారు. విశాఖలో రాజధాని కూడా స్వామీజీ విలువైన సలహా అంటారు. తూర్పు నుంచి పాలన సాగిస్తే అన్నీ శుభాలే జరుగుతాయని, ఖజానా బాగా లాభాలతో నిండుతుందని కూడా స్వామీజీ చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికి జగన్ విశాఖకు రాలేకపోతున్నారు. దీని కోసం స్వామీజీ రెండు అద్భుతమైన ముహూర్తాలు పెట్టారని వార్తలు అయితే బయటకు వచ్చాయి. మొదటిది మార్చి 25 ఉగాది వేళ అయితే అప్పటికే లాక్ డౌన్ లోకి దేశం మొత్తం వెళ్ళిపోయింది. ఇక రెండవ ముహూర్తంగా ఏప్రిల్ 28న పెట్టారట. అయితే రెండవ విడత లాక్ డౌన్ కూడా కొనసాగుతోంది. మరో వైపు విశాఖ ఏకంగా రెడ్ జోన్ లోకి వచ్చేసింది. దాంతో స్వామీజీ ముహూర్తాలు తప్పుతున్నాయా? అన్న డౌట్లు వైసీపీ పెద్దలలో కలుగుతున్నాయని అంటున్నారు.ఇక స్వామీజీ చెప్పిన ముహూర్తాలు అన్నీ బయటకు రావడం పట్ల కూడా వైసీపీలో కొంత చర్చ కూడా సాగినట్లుగా తెలుస్తోంది. స్వామీజీ సహజంగానే ప్రచారం కోరుకుంటారని, దాని వల్లనే సీక్రెట్ గా ఉండాల్సినవి లీక్ అవుతున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో వైసీపీని తెలుగుదేశం గట్టిగా టార్గెట్ చేయడమే కాకుండా స్వామీజీ పెట్టిన ముహూర్తాలు మాజీ మంత్రి దేవినేని ఉమ లాంటి వారు బయటకు చెప్పేసి కడిగేస్తున్నారు. ఇది పెద్ద చికాకుగా జగన్ సర్కార్ కి తయారైందట. ఈ పరిణామాలతో వైసీపీకి స్వామీజీతో దూరం పెరిగిందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. స్వామీజీ పవర్ సీఎం సీటు వరకూ చేర్చింది కానీ ఆ తరువాత నడవడంలేదని కూడా అంటున్నారు. నిజానికి స్వామి పెట్టిన ముహూర్తంలో ప్రమాణం చేసిన జగన్ కి ఆది నుంచే అష్టకష్టాలు కూడా ఎదురవడాన్ని వైసీపీ పెద్దలు ఇపుడిపుడే గుర్తిస్తున్నారుట. మరి రాజ గురువు కొత్త పలుకు జగన్ వింటారా అన్నది ఇప్పటికైతే సందేహమేనని అంటున్నారు.

Related Posts