Highlights
- సభ నడువక పోవడం నా తప్పుకాదు
- తన పార్లమెంటు జీతాన్ని వదులుకునేది లేదు
- రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి
పార్లమెంటులో వృథాగా పోయిన 23రోజుల వేతనాన్ని తీసుకోవద్దని ఎన్డీయే ఎంపీలు తీసుకున్న నిర్ణయాన్ని భాజపాకు చెందిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విభేదించారు. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి తన పార్లమెంటు జీతాన్ని వదులుకునేది లేదని స్పష్టం చేశారు. తాను అన్ని రోజులు సభకు హాజరయ్యానని, సభ సక్రమంగా నడవకపోవడం తన తప్పు కాదని వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగలేదనీ, ప్రజా ప్రయోజనం చేకూరనందున సభలో వృథాగా పోయిన 23 రోజుల వేతనాన్ని తమ(ఎన్డీయే) ఎంపీలు తీసుకోబోరని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ నిన్న వెల్లడించిన నేపథ్యంలో స్వామి ఈ విధంగా స్పందించారు. పార్లమెంటు సమావేశాల్లో23రోజులపాటు వృథా అయిందని, ఈ కాలానికి జీతం, ఇతర భత్యాలను వదులుకోవాలని వస్తున్న డిమాండ్లపై ఆయన తన పార్టీ ఎంపీలతో విభేదించారు.‘నేను రోజూ సభకు వెళ్లాను. సభ నడవకపోవడం నా తప్పు కాదు. ఏదేమైనా నేను రాష్ట్రపతి ప్రతినిధిని. ఆయన చెప్పేంత వరకు జీతం తీసుకోనని నేను ఎలా చెప్పగలను’ అని స్వామి అన్నారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఎన్డీయే ఎంపీలంతా సభలో ప్రతిపక్షాల ఆందోళనల వల్ల వృథాగా పోయిన 23రోజుల వేతనం తీసుకోవద్దని నిర్ణయించారు. ప్రతిపక్షాల ఆందోళనల వల్ల పార్లమెంటు కార్యకలాపాలకు ఆటంకం కలిగిందని సందేశం ఇవ్వడానికే ఈ విధంగా చేస్తున్నామని నిన్న అనంత్ కుమార్ వెల్లడించారు. ప్రజల కోసం పనిచేసినప్పుడు మాత్రమే వేతనం అందుకోవాలని అన్నారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాల వల్ల లోక్‌సభ, రాజ్యసభ సజావుగా పనిచేయలేదని ఆరోపించారు. దీనిపై సుబ్రహ్మణ్యం స్వామి స్పందిస్తూ నేను రోజూ వెళ్ళేవాడిని. సభ సజావుగా నడవలేదంటే, అది నా తప్పు కాదు. ఏదేమైనా నేను రాష్ట్రపతి ప్రతినిథిని ఆయన ఆ విధంగా చెప్పే వరకు, నేను నా జీతాన్ని తీసుకోబోనని ఎలా చెప్పగలను అని పేర్కొన్నారు.