YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

యూపీలో మసీదుల్లో జమాతేకు చెందిన విదేశీయులను దాచిపెట్టిన ప్రొఫెసర్ తో సహా 30 మంది అరెస్ట్

యూపీలో మసీదుల్లో జమాతేకు చెందిన విదేశీయులను దాచిపెట్టిన ప్రొఫెసర్ తో సహా  30 మంది అరెస్ట్

 యూపీలో మసీదుల్లో జమాతేకు చెందిన విదేశీయులను దాచిపెట్టిన ప్రొఫెసర్ తో సహా  30 మంది అరెస్ట్

 ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో కల్లోలం   జమాతేకు చెందిన ఇండొనేషియా, థాయ్‌లాండ్ పౌరులను మసీదుల్లో దాచిపెట్టారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఏడుగురు ఇండొనేషియా, 9 మంది థాయ్‌లాండ్ పౌరులను అరెస్ట్ చేశారు. అంతేకాదు వీరికి సహకరించిన 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ మహ్మద్ షాహిద్‌ సహా మొత్తం 30 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. జమాతే సభ్యులను దాయడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని మసీదుల్లో జమాతేకు చెందిన సభ్యులను దాచి ఉంచే అవకాశం ఉందనే కోణంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.  కరోనా నేపథ్యంలో హెచ్చరికలు వచ్చినా బేఖాతరు చేస్తూ వందలాది మంది సదస్సు జరిగిన భవనంలోనే ఉండిపోయారు. మరికొందరు వివిధ ప్రాంతాలకు వెళ్లారు. అలా వెళ్లినవారిలో కొందరిని మాత్రమే ప్రభుత్వం గుర్దించి అరెస్ట్ చేసింది. మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జమాతే మర్కజ్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో హెచ్చరికలు వచ్చినా బేఖాతరు చేస్తూ వందలాది మంది సదస్సు జరిగిన భవనంలోనే ఉండిపోయారు. మరికొందరు వివిధ ప్రాంతాలకు వెళ్లారు. అలా వెళ్లినవారిలో కొందరిని మాత్రమే ప్రభుత్వం గుర్దించి అరెస్ట్ చేసింది. మిగతా చాలామంది వివరాలు తెలియాల్సి ఉండగా మసీదుల్లో విదేశీయులను దాచిపెట్టడంపై యూపీ సర్కారు మండిపడుతోంది. ఓ పక్క కరోనా కట్టడికి దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంటే జమాతే సభ్యులను అది కూడా విదేశీయులను దాచి ఉంచడంలో కుట్ర దాగి ఉందని యోగి సర్కారు అనుమానిస్తోంది. దర్యాప్తు కొనసాగుతోంది.

Related Posts