తెలంగాణలో వచ్చే మార్చి నాటికి 2లక్షల 50వేల కోట్ల అప్పు తయారవుతుంది. ఇతర వినియోగాలతో పథకాలకు నిధులు లేకుండా పోతున్నాయని ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు. నూతనంగా వచ్చిన ప్రభుత్వానికి సహకరించాం. సలహాలిచ్చి ప్రభుత్వాన్ని సరిచేసుకోమన్నాం. నిరసనలు, వాకౌట్ల ద్వారా సరిచేయాలనుకున్నాం. చివరకు మమ్మల్ని మాట్లాడనీయకుండా బయటకు పంపారని అయన విమర్శించారు. ప్రభుత్వ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు. పద్ధతిలేని ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలో ప్రజలు ఆలోచించుకోవాలి. ఒకవ్యక్తి తప్పుడు లెక్కలు చూపిస్తే ఏం చేస్తాం.. మరి ప్రభుత్వమే తప్పుడు లెక్కలు చెప్తే ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజలే ప్రభుత్వానికి రాబోయేఎన్నికల్లో తమ ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి. మాకు ప్రశ్నించే హక్కు లేకపోతే టిఆరెస్ కు పరిపాలించే హక్కు ఉందా అని నిలదీసారు.