నిరాడంబరంగా గంగ జాతర చిత్తూరు ఏప్రిల్ 21, చిత్తూరు గంగ జాతర పూజా విధానంలో మార్పులు జరిగాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త లావణ్య మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో చిత్తూరు నడివీది గంగమ్మ జాతర పూజా విధానంలో మార్పుచేసినట్లు ఆమె ప్రకటించారు. మిరాశీ దారుల ఆధ్వర్యంలో మాత్రమే జాతర వేడుకలు జరుగుతుందన్నారు. మే 5వ తేదీన జాతర చాటింపు, మే 12,13 వ తేదీల్లో మిరాశీ దారుల సమక్షంలో జాతర జరుగునట్లుపేర్కొన్నారు.కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపట్టిన లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని, అలాగే సంప్రదాయం ప్రకారం నిర్వహించాల్సిన గంగ జాతరను ఈసారి నిరాడంబరంగా చేస్తున్నట్లు వెల్లడించారు. నడి వీధిలో ఈ ఏడాది గంగమ్మను ప్రతిష్టించడం లేదన్నారు. పోలీసుల అనుమతి తో శక్తి విగ్రహానికి మాత్రం పూజల చేస్తామన్నారు. ప్రజలు తమ ఇంటి వద్దనే పొంగల్లు పెట్టు కోవాలని, జాతర రోజున నట్టింట్లో అంబలి, తలిగే పెట్టి గంగమ్మను ప్రార్తించాలని కోరారు. కరోనా మహమ్మారి ని తరిమి కొట్టేయందుకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.