YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు లో టెన్షన్

నెల్లూరు లో టెన్షన్

నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ లో హైడ్రామా నెలకొంది..  వైసీపీ టీడీపీల నాయకుల మధ్య నినాదాలు, ప్రతినినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.. తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హౌస్ ఫర్ ఆల్ పథకం పై నెల్లూరులో  టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య సవాల్ ప్రతిసవాల్ కొనసాగుతున్నాయి.. ఎన్టీయార్ ఇళ్లులో దాదాపు 150 కోట్ల అవినీతి జరిగిందని, మంత్రి నారాయణ చర్చకు వస్తే నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు..   దీంతో ఇవాళ  గాంధీబొమ్మ వద్ద టీడీపీ, వైసీపీ నాయకులు మెహరించారు. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గాంధీబొమ్మ వద్దకు రానప్పటికీ ఇరు పార్టీల నాయకులు రావడంతో పోలీసులు రంగ ప్రవేశంచేశారు.. ఇరు వర్గాలను శాంతిపచేశారు.

Related Posts