అమెరికా ప్రజలకోసం భారత్ పేద ప్రజల కడుపుల్ని కొడుతోంది
హైదరాబాద్ ఏప్రిల్ 21
దేశంలోని పేదలంతా మేల్కోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో పేద ప్రజల గురించి రియాక్ట్ అయ్యారు. దేశంలోని పేదలకు చెందాల్సిన బియ్యాన్ని.. ధనికులకు శానిటైజర్లు వాడేందుకు వినియోగిస్తున్నారని ఆయన తన ట్వీట్లో విమర్శించారు. దేశంలోని పేదలంతా ఈ విషయం పట్ల మేల్కోవాలన్నారు. మీరంతా ఆకలితో అలమటిస్తుంటే, మీకు దక్కాల్సిన బియ్యంతో ప్రభుత్వం శానిటైజర్లు తయారు చేస్తోందన్నారు. అమెరికా ప్రజల చేతుల్ని శుభ్రం చేసేందుకు భారత ప్రభుత్వం పేద ప్రజల కడుపుల్ని కొడుతోందన్నారు. ఈ ఏడాది వరి పంట ఎక్కువగా ఉన్న కారణంగా.. అధిగ దిగుబడి వస్తే, ఆ బియ్యంతో శానిటైజర్లు తయారు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాహుల్ స్పందించారు.