నెల్లూరు నగర నడిబొడ్డున ఉండే నిప్పొ భూ బదలాయింపుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శ, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.. వందల కోట్ల విలువ చేసే నిప్పో భూములను దారాదత్తం చేసేందుకు మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్ కుట్రలు పన్నుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.. నెల్లూరులో మీడియతో మాట్లాడిన ఆయన నిప్పో భూములకు సంబంధించిన పైల్స్ దగ్దమయ్యాయని కలెక్టర్ ముత్యాల రాజు చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శమన్నారు. కోట్ల విలువైన భూములను కొట్టేసేందుకు అధికార పార్టీ నేతలు కుట్రలో కలెక్టర్ పావుగా మారాడని విమర్శించారు. నిప్పో భూములను ధారాదత్తం చేస్తే మంత్రి నారాయణ,మేయర్ చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రాకు చెందిన ఓ మంత్రికి నిప్పో భూములను కట్టబెట్టేందుకు మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.. నిప్పో భూములను కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు.