మహారాష్ట్రలో లాక్‌డౌన్ ఉల్లంఘన13,381 మంది అరెస్ట్
ముంబయి ఏప్రిల్ 21
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 13,381 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి నేటి ఉదయం 4 గంటల వరకు అరెస్ట్ అయిన వారి వివరాలను మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. లాక్‌డౌన్ నియమాలు అతిక్రమించిన 41,768 వాహనాలను సీజ్ చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద మొత్తం 60,005 కేసులు నమోదైనట్లు తెలిపారు. అదేవిధంగా పోలీసులపై దాడి చేసిన, దూషించిన కేసుల్లో 411 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.