YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

టిటిడి ఇ-పబ్లికేషన్స్లో 781 పుస్తకాలు

టిటిడి ఇ-పబ్లికేషన్స్లో 781 పుస్తకాలు

టిటిడి ఇ-పబ్లికేషన్స్లో 781 పుస్తకాలు
 *  7 భాషల్లో ఆధ్యాత్మిక పుస్తకాలు
*  అందుబాటులో రామాయణ భారత , భాగవతాలు
 *  6 భాషల్లో సప్తగిరి మాసపత్రిక
*  ఉచిత డౌన్లోడ్  కు అవకాశం
తిరుపతి, ఏప్రిల్ 21
 టిటిడి  తన ఇ-పబ్లికేషన్స్ వెబ్సైట్ను నూతన హంగులతో  అందుబాటులోకి తీసుకొచ్చింది. రామాయణ భారత భాగవతాలు, శ్రీవారి వైభవం,  ఆధ్యాత్మిక , ధార్మిక , సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన  781 పుస్తకాలను 7 భాషల్లో  అందుబాటులో ఉంచింది.     2015, మార్చి 21న టిటిడి వెబ్సైట్లో ఇ-పబ్లికేషన్స్ను ప్రారంభించారు.  ఈ ఓ  అనిల్ కుమార్ సింఘాల్,   జే ఈ ఓ  బసంత్. కుమార్ ల ఆదేశంతో  వెబ్ సైట్ ను  మరింతగా  ప్రజలకు అందుబాటులోకి తేవడానికి  ప్రచురణలు, ఐ టీ విభాగాల అధికారులు రంగం లోకి దిగారు. టిటిడి ఆర్థికసాయంతో ముద్రించిన అన్ని పుస్తకాల్లోని కంటెంట్కు సంబంధించిన సమీక్ష చేశారు. అనంతరం కొత్త డిజైన్తో, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా  వెబ్సైట్ను తీర్చిదిద్దారు. ఇందులో వివిధ రకాల సాహిత్యం పుస్తకాలు,  రచయితల పేర్లతో పుస్తకాలను ఎంచుకోవడానికి వీలు కల్పించారు. స్పెషల్ బుక్స్ కేటగిరీలో వేదాలు, ఉపనిషత్తులకు సంబంధించిన  అరుదైన పుస్తకాలు అందుబాటు లోకి తెచ్చారు.
ప్రస్తుతానికి  ఈ వెబ్సైట్లో 781 పుస్తకాలున్నాయి.  తెలుగులో 492, సంస్కృతం-75, ఇంగ్లీషు-122, కన్నడం-2, హిందీ-74, తమిళం-14, బంజారా-2 గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.వేదసాహిత్యం 2.పురాణ ఇతిహాస సాహిత్యం, 3. కావ్యప్రబంధ సాహిత్యం, 4. సంకీర్తన సాహిత్యం, 5. శతక బాల సాహిత్యం, 6. ఆలయ సాహిత్యం, 7.  సాధారణ సాహిత్యం,  విభాగాల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. దశలవారీగా మరిన్ని పుస్తకాలను ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. సప్తగిరి మాసపత్రిక పాత సంచికలు కూడా... టిటిడి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో ముద్రిస్తున్న సప్తగిరి మాసపత్రిక ను పాత సంచికల తో సహా ఉచితంగా చదువు కోవడం కోసం  అందుబాటులో ఉంచారు.  ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చందా చెల్లించి సప్తగిరి మాసపత్రికను బుక్ చేసుకోవచ్చు.

Related Posts