సింగపూర్ లో జూన్ ఒకటి వరకు లాక్ డౌన్ పొడిగింపు
సింగపూర్ ఏప్రిల్ 21
జూన్ ఒకటి దాకా లాక్ డౌన్ పొడిగించాలని సింగపూర్ నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు మూసి ఉంచుతారు. మే నాలుగో తేదీకి లాక్‌డౌన్ పూర్తి కావాల్సి ఉన్నా మరో నాలుగువారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని లీ లూంగ్ ప్రకటించారు. సింగపూర్‌లో ఇప్పటివరకూ 9, 125 కరోనా కేసులు నమోదయ్యాయి. వలస కార్మికుల ద్వారా కొత్తగా 1111 కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఆసియా దేశాలకు చెందిన కూలీలు ఇక్కడి పరిశ్రమల్లో ఎక్కువగా పనిచేస్తుంటారు. సింగపూర్ పరిశ్రమలు వీరిపైనే ఆధారపడ్డాయి. సింగపూర్‌లో ప్రస్తుతం రోజుకు వెయ్యి చొప్పున కరోనా కేసులు నమోదవుతున్నాయి.