రైతులను వేధిస్తే ..కఠిన చర్యలు: మంత్రి ఈటల
కరీంనగర్ ఏప్రిల్ 21
రైతులను వేధిస్తే ఊరుకోబోమని.. కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. నేడు ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మాట్లాడుతూ.. తాలు పేరుతో తరుగు తీయవద్దని... శాస్త్రీయంగా తీయాలన్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేయవద్దని ఈటల హెచ్చరించారు.రాష్ట్రంలో రైతులను ఇబ్బంది పెట్టే ధైర్యం చేస్తారా? అని ప్రశ్నించారు. కష్టపడి పంట పండిస్తే తరుగు పేరుతో బ్లాక్ మెయిలింగ్ పనికి రాదన్నారు. ఏం కావాలో ప్రభుత్వంతో కొట్లాడాలి కానీ రైతును ఇబ్బంది పెట్టొద్దన్నారు. రైతును ఇబ్బంది పెడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈటల హెచ్చరించారు.