YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై, ఏప్రిల్ 21
దేశీ స్టాక్ మార్కెట్ 3 రోజుల లాభాలకు బ్రేకులు పడ్డాయి. బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం నిట్టనిలువునా కుప్పకూలాయి. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పతనం కావడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై గట్టిగానే పడింది. కరోనా వైరస్ వల్ల డిమాండ్ పడిపోవడం... తద్వారా క్రూడ్ నిల్వలు పేరుకుపోవడంతో క్రూడ్ ధరలు మైనస్‌లోకి వెళ్లిపోయాయి.ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1270 పాయింట్లు నష్టపోయింది. 30,378 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 9000 పాయింట్ల దిగువకు క్షీణించింది. చివరకు సెన్సెక్స్ 1011 పాయింట్ల నష్టంతో 30,637 పాయింట్ల వద్ద, నిఫ్టీ 280 పాయింట్ల నష్టంతో 8981 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
✺ నిఫ్టీ 50లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, భారతీ ఇన్‌‌ఫ్రాటెల్, భారతీ ఎయిర్‌టెల్, హీరో మోటొకార్ప్, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 4 శాతానికి పైగా పెరిగింది.
✺ అదేసమయంలో ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కో, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 12 శాతానికి పైగా పడిపోయింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. ఒక్క నిఫ్టీ ఫార్మా మాత్రమే లాభపడింది. 2 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ మీడియా ఇండెక్స్‌లు 5 శాతానికి పైగా పడిపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3 శాతానికి పైగా క్షీణించింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ కూడా 4 శాతం తగ్గింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. 29 పైసలు నష్టంతో 76.83 వద్ద కదలాడుతోంది. ఇది ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 15.21 శాతం తగ్గుదలతో 21.66 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 18.21 శాతం క్షీణతతో 16.67 డాలర్లకు తగ్గింది.

Related Posts