YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వేడెక్కుతున్న ఏపీ పాలిటిక్స్

వేడెక్కుతున్న ఏపీ పాలిటిక్స్

వేడెక్కుతున్న ఏపీ పాలిటిక్స్
విజయవాడ, ఏప్రిల్ 22
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎపుడూ ఆసక్తికరమైన అంశమే. ముఖ్యమంత్రి జగన్, విపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ముఖాముఖీ కలుసుకుంటారా? అన్నదే ఒక చర్చ. ఇద్దరూ రాజకీయాలు చేయడం లేదు. వ్యక్తిగత వైరాలే ముందుకు తెస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ ని అసలు లెక్కచేయలేదు. జగన్ కి అనుభవం లేదని చంద్రబాబు పక్కన పెడితే చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని జగన్ పట్టించుకోవడంలేదు. ఇది మొత్తంగా ఏపీ రాజకీయాలకే కాదు, ప్రజలకు కూడా చేటు తెచ్చే పరిణామంగా మేధావులు అంటున్నారు.ఏపీలో కరోనా ప్రవేశించి నెల రోజులవుతోంది. ఈ కాలంలో కేసులు ఒకటి నుంచి నెమ్మదిగా మొదలి ఇపుడు ఆరు వందల పై చిలుకు చేరుకున్నాయి. మొదటి పది రోజులూ ఇరవై లోపు ఉన్న కేసులు ఒక్కసారిగా వందలకు చేరుకుంటూ ఏపీలో దూకుడుగానే కరోనా ఉందని అనేలా సీన్ ఉంది. ఇక జగన్ సర్కార్ మొదట్లో తేలికగా తీసుకున్నా ఇపుడు మాత్రం సీరియస్ గానే రియాక్ట్ అవుతోంది. ఎక్కడికకక్కడ గట్టి చర్యలు చేపడుతోంది. వైద్య పరికరాల నుంచి మాస్కు వరకూ అన్నీ యుధ్ధ ప్రాతిపదినక ఆర్డర్లు ఇచ్చి సమకూరుస్తోంది.ఈలోగానే రాజకీయ పార్టీలు వరసగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అఖిల పక్ష సమావేశం పెట్టమని కోరుతూ వస్తున్నాయి. సీపీఐ రామక్రిష్ణ మొదట ఈ డిమాండ్ చేయగా, తరువాత బీజేపీ, ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఇదే అడుగుతోంది. ఏకంగా చంద్రబాబు అఖిలపక్షం పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఇపుడున్న పరిస్థితుల్లో వీడియో సమావేశాల ద్వారా అన్ని పార్టీలతో ముఖ్యమంత్రి జగన్ సంప్రదించాలని వారు కోరుతున్నారు.నాడు జగన్ విపక్ష నేతగా ప్రతీ విషయానికి అఖిల పక్షం పిలవమని చంద్రబాబుని కోరుతూ వచ్చారు. కానీ చంద్రబాబు దేన్ని పట్టించుకోలేదు. నాడు అసెంబ్లీలో మూడే పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఎటూ మిత్ర పక్షమే. దాంతో వైసీపీని పూచిక పుల్లలా తీసిపారేశారు. అయితే రిజిష్టర్ అయిన అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపితే ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది అన్నది మేధవుల సూచన. నాడు చంద్రబాబు అలా చేయలేదు కాబట్టి జగన్ కూడా ఇపుడు అదే పంధా అనుసరిస్తున్నారు. సరే చంద్రబాబు టైంలోని సమస్యల కంటే కూడా ఇపుడు పెను విపత్తు రూపంలో కరోనా వచ్చింది కాబట్టి జ‌గన్ వీడియో సమావేశం నిర్వహించాలని తటస్థుల నుంచి కూడా సూచనలు వస్తున్నాయికరోనా విపత్తు ఎవరూ ఎరగనిది. పరిష్కారాలు, అదుపు చేయడాలూ కూడా ఎవరికి వారే కొత్తగా ఆలోచించాలి. అందువల్ల ఒక బుర్రకు మరో నాలుగు కలిస్తే మంచికే దారి తీస్తుందని అంటున్నారు. దీని మీద బీజేపీ నేత సోము వీర్రాజు కూడా జగన్ కి సూచన చేశారు. బాబుతోనైనా సంప్రదించాలని కోరారు. కానీ ఏపీ రాజకీయాలు చూసుకుంటే జగన్ చంద్రబాబు ముఖం చూసేందుకే ఇష్టపడడంలేదు. అది అసలు అయ్యే పని కాదు. మొత్తానికి కరోనా అయినా మరేదైనా కూడా ముఖాముఖాలు చూసుకోలేని దుస్థితిలో ఏపీలో రాజకీయం సాగడం దారుణమే.

Related Posts