YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు...బుక్కవుతున్నారు..

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు...బుక్కవుతున్నారు..

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు...బుక్కవుతున్నారు...
గుంటూరు, ఏప్రిల్ 22
కరోనా వైరస్ వ్యాప్తికి ఆ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు విపక్షాలకు టార్గెట్ అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం వారి సామాజిక వర్గమే కావడం దురదృష్టకరం. కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తుంది. రోజురోజకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఎవరు చేసిన తప్పు కాకపోయినా మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి ఈ వైరస్ ఎక్కువ గా సంక్రమించిందన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వైరస్ తో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలోనూ, విపక్షాలకు లక్ష్యంగా మారినట్లు కన్పిస్తోంది.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజాద్ భాషా మర్కజ్ ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని విపక్షాలు కూడా ఉపయోగించుకున్నాయి. అయితే తాను ఢిల్లీ వెళ్లి మర్కజ్ ప్రార్థనలకు అటెండ్ కాలేదన్న విషయాన్ని చెప్పుకోవడానికి ఆయన పెద్దయెత్తున శ్రమించాల్సి వచ్చింది. చివరకు పోలీసులను కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ఆయన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లలేదన్న విషయం ఆలస్యంగా గ్రహించిన మీడియా తర్వాత మౌనం వహించింది.వైసీపీ గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా సయితం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యే ముస్తాఫా బావ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ముస్తాఫా పెద్దయెత్తున పార్టీ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఈ పార్టీకి వైసీపీ ఎమ్మెల్యేలు పలువురు హాజరయ్యారని కూడా సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. చివరకు ముస్తాఫా 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటయిన్ కు వెళ్లి వచ్చారు. ముస్తాఫా ఈ ప్రచారంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలకు సేవ చేయాలనుకున్నా జనం ఆయనను దరిచేరనీయలేదు.కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. కర్నూలు టౌన్ కు హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కర్నూలు జిల్లా నుంచి మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కుగా ఉన్నారు. అయితే హఫీజ్ ఖాన్ ముస్లింలకు మద్దతుగా నిలిచారని సోషల్ మీడియాలోనూ, విపక్షాలు విస్తృతంగా ప్రచారం చేశారు. తాను మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని దగ్గరుండి క్వారంటైన్ కు పంపుతున్నా తనపై విషప్రచారం చేస్తున్నారని హఫీజ్ ఖాన్ అంటున్నారు. తాను ముస్లిం కావడమే దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే ఎంతగా ఆవేదన చెందుతున్నారో ఇట్టే అర్థమవుతుంది. గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉండటం కూడా ఈ ముగ్గురు వైసీపీ ప్రజాప్రతినిధులు టార్గెట్ అయ్యారు.

Related Posts