YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కరోనాలోనూ..ఎంపీ మంత్రివర్గ విస్తరణ

కరోనాలోనూ..ఎంపీ మంత్రివర్గ విస్తరణ

కరోనాలోనూ..ఎంపీ మంత్రివర్గ విస్తరణ
కమల్ కేబినెట్ లో ఇద్దరికి మంత్రి పదవులు
భోపాల్, ఏప్రిల్ 22
ఎట్ట‌కేల‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ మంగ‌ళ‌వారం విస్త‌రించారు. రాజధాని భోపాల్ రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఐదుగురు నూత‌న మంత్రుల‌తో గ‌వ‌ర్న‌ర్ లాల్జీ టాండ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. నిజానికి గ‌త‌నెలలో రాజ్యాంగ సంక్షోభం త‌లెత్త‌డంతో కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి క‌మ‌లనాథ్ రాజీనామా చేశారు. ఆయ‌న స్థానంలో బీజేపీకి చెందిన చౌహాన్ గ‌త‌నెల 23న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అప్ప‌టి నుంచి దాదాపు నెల‌రోజులుగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌ప‌క‌పోవ‌డంతో పెద్ద‌యెత్తున విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.చౌహాన్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసే స‌మ‌యానికి రాష్ట్రంలో కేవ‌లం 9 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా.. ఈ 29 రోజుల్లో ఆ సంఖ్య 1400 మార్కును దాటింది. 76 మంది మ‌ర‌ణించారు. క‌రోనా ఉధృతంగా కొన‌సాగ‌తున్న వేళ రాష్ట్రంలో క‌నీసం ఆరోగ్య‌మంత్రి కూడా లేరని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో చౌహాన్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు న‌రోత్తం మిశ్రా, తుల‌సి సిలావ‌త్‌, గోవిండ్ సింగ్ రాజ్‌పుత్‌, మీనా సింగ్‌, క‌మ‌ల్ ప‌టేల్ మంత్రులుగా తాజాగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.తాజా మంత్రుల్లో ఇద్ద‌రు శిలావ‌త్‌, రాజ్‌పుత్‌ గ‌తనెల‌లో రాజీనామా చేసిన క‌మ‌ల్‌నాథ్ మంత్రివ‌ర్గంలోని స‌భ్యులు కావ‌డం విశేషం. ఇక ఈ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చౌహాన్ సామాజిక న్యాయం పాటించిన‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వ‌ర్గాలకు చెందిన వారిని మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించారు. మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా వెయ్యి పాజిటివ్ కేసులు దాటిన రాష్ట్రాల్లో మ‌ధ్యప్రదేశ్ ఒక‌టి. ఇప్ప‌టివ‌ర‌కు ఆ రాష్ట్రంలో 1480కిపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

Related Posts