YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నిరర్ధక ఆస్తులు, చెల్లించని రుణాలఫై రాష్ట్రపతి ఆందోళన

Highlights

  • నిరర్ధక ఆస్తులు, చెల్లించని రుణాలఫై రాష్ట్రపతి ఆందోళన
  • రుణాలు ఎగ్గొడుతున్న వారి వల్ల ఇబ్బందిపడుతున్ననిజాయితీ పరులు
నిరర్ధక ఆస్తులు, చెల్లించని రుణాలఫై రాష్ట్రపతి ఆందోళన

బ్యాంకింగ్‌ రంగంలో నిరర్ధక ఆస్తులు, చెల్లించని రుణాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆందోళన వ్యక్తంచేశారు.బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొడుతున్న వారి వల్ల నిజాయితీగా పన్ను కట్టేవాళ్లు ఇబ్బందిపడుతున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. దిల్లీలో జరిగిన ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్స్‌ వార్షిక సమావేశంలో పాల్గొన్న కోవింద్‌ బ్యాంకింగ్‌ రంగంలో జరుగుతున్న మోసాలపై మాట్లాడారు. వ్యాపారంలో వైఫల్యాలు జరుగుతుంటాయి.. కానీ బ్యాంకు రుణాల విషయంలో ఉద్దేశపూర్వకంగా మోసాలు జరుగుతున్నాయని అన్నారు. దీని వల్ల తోటి భారతీయ కుటుంబాలన్నీ ఇబ్బందిపడుతున్నాయి. ఫలితంగా అమాయకులైన పౌరులు నష్టపోతున్నారు. నిజాయితీగా పన్నులు కట్టే వారిపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.

గత ఏడాది డిసెంబర్ వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కావాలని పన్ను ఎగవేసిన వారి సంఖ్య 9 వేలు దాటింది. వాళ్లు ఎగవేసిన మొత్తం అమౌంట్ సుమారు లక్షా 10 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజమైన వ్యాపారంలో వైఫల్యాలు ఉంటాయని ఆయన అన్నారు. కానీ కావాలనే బ్యాంకులకు కుచ్చుటోపీ వేసేవాళ్ల వల్ల తోటి భారతీయులు ఇబ్బందిపడుతారని ఆయన తెలిపారు. డిఫాల్టర్ల వల్ల పన్ను చెల్లించేవాళ్లకు సమస్యలు ఎక్కువవుతాయన్నారు. గత8 ఏళ్లుగా ఎన్‌పీఏలు పెరుగుతున్నాయని పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రభుత్వ బ్యాంకుల్లో ఆ మొత్తం సుమారు 7.77 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముద్రా స్కీమ్ కింద సుమారు 117 మిలియన్ల రుణాలు అందజేసినట్లు రాష్ట్రపతి తెలిపారు. 

ముద్ర పథకం ద్వారా దాదాపు 117 మిలియన్ల రుణాలు ఇచ్చామని, ఈ రుణాలు అందుకున్న వారిలో సుమారు 88 మిలియన్ల మంది మహిళా వ్యాపారవేత్తలు ఉన్నారని కోవింద్‌ వెల్లడించారు. అయితే 2017 డిసెంబరు నాటికి ముద్ర పథకంలో నిరర్ధక ఆస్తులు 8శాతం కన్నా తక్కువే ఉన్నాయని తెలిపారు. అలాగే 2016 ఏప్రిల్‌లో ప్రారంభించిన స్టాండప్‌ ఇండియా పథకం కింద మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు 45వేల రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో కూడా 39 వేల రుణాలు మహిళలకు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, చెల్లించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ తిరిగి చెల్లించని వారి సంఖ్య 2017 డిసెంబరు చివరి నాటికి 9,063కు చేరింది. వీరు చెల్లించకుండా ఎగ్గొట్టిన డబ్బు సుమారు రూ.1,10,050కోట్లు ఉంటుందని అంచనా.

Related Posts