YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

కోట్ల రూపాయిల ఆదాయం నష్టం

కోట్ల రూపాయిల ఆదాయం నష్టం

కోట్ల రూపాయిల ఆదాయం నష్టం
హైద్రాబాద్, ఏప్రిల్ 22
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, నూనె, రైస్‌ మిల్లులు, ప్లాస్టిక్‌, ఫ్యాబ్రికేటింగ్‌, అల్యూమినియం, ఎలక్ట్రికల్‌, జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ తదితర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మొత్తం 25వేల వరకు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 15వేలు (60శాతం) ఉన్నాయి. వీటితోపాటు 10వేల పరిశ్రమలు ఎన్‌పీఏ(నాన్‌ ఫర్మామెన్స్‌ అసెర్ట్‌) జాబితాలో ఉన్నాయి. ఈ పరిశ్రమలన్నీ స్వయం ఉపాధితో పాటు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.పరిశ్రమలపై ప్రత్యక్ష్యంగాను, పరోక్షంగాను ఆధారపడిన 18.5లక్షల మంది కార్మికులు కరోనా నేపథ్యంతో ఉపాధి లేక రోడ్డున పడ్డారు. ఒక్కో పరిశ్రమలో ప్రత్యక్షంగా సుమారు 24 మంది కార్మికుల లెక్కన 6లక్షల మంది, పరోక్షంగా మరో 50 మంది అంటే 12.5లక్షల మంది కార్మికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ కార్మికుల్లో 20శాతం తెలంగాణ, 20శాతం ఆంధ్రప్రదేశ్‌, 60శాతం మంది కర్నాటక, మధ్యప్రదేశ్‌, బీహార్‌, మహారాష్ట్ర, ఒడిషా, బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన వారున్నారు.ఒక్కో పరిశ్రమను సుమారు రూ.3కోట్ల పెట్టుబడితో స్థాపించగా, ఏడాదికి ఒక్కో పరిశ్రమ టర్నోవర్‌ సుమారు రూ. 10కోట్లు ఉంటుంది. అంటే 25వేల పరిశ్రమలకు రూ. 2.50లక్షల కోట్లు. అయితే, కరోనా ప్రభావం దాదాపు మూడు నెలలు ఉండనుంది. ఈక్రమంలో పరిశ్రమలు నడవకపోవడంతో సుమారు రూ.62.50లక్షల కోట్ల టర్నోవర్‌రుకు గండిప డుతుంది. పరిశ్రమలకు వచ్చిన ఆదాయం మీద కేంద్రానికి 14 శాతం, రాష్ట్రానికి 14శాతం పన్నులు మొత్తం 28శాతం అంటే మూడు నెలల్లో రూ.17.49లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు 18.5లక్షల మంది కార్మికుల్లో ఒక్కొక్కరికి సుమారు రూ.12వేల వేతనం ఉన్నా.. రూ.2,220 కోట్లు అవుతుంది. వీటితోపాటు కరెంట్‌ బిల్లు, వాటర్‌ బిల్లు, ఆస్తి పన్ను, లైసెన్స్‌ ఫీజు, కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించే ఫీజులు అదనం. ఈ కరోనా ప్రభావం తరువాత కూడా పరిశ్రమలు నడపడం కష్టతరంగా మారనుంది. అందుల్ల జీఎస్టీ, ఫీజులను మాఫీ చేయాలని పరిశ్రమల యజమానులు ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నారు.
 

Related Posts