YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

అమెరికాలో ఇండియన్ డాక్టర్ కు జేజేలు

అమెరికాలో ఇండియన్ డాక్టర్ కు జేజేలు

అమెరికాలో ఇండియన్ డాక్టర్ కు జేజేలు
న్యూయార్క్, ఏప్రిల్ 22
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న వేళ.. భారత సంతతికి చెందిన వైద్యులు విశేష సేవలు అందిస్తున్నారు. కరోనా రోగులకు సేవలు అందించే క్రమంలో కొంత మంది డాక్టర్లు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. అయినా.. వెన్ను చూపకుండా, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అమెరికా పౌరుల కోసం పనిచేస్తున్న ప్రవాస భారతీయులకు అక్కడి సమాజం జేజేలు పలుకుతోంది. హైడ్రోక్లోరోక్విన్ ఔషధాలు పంపి ప్రాణదాతగా నిలిచిన భారత్‌ను అమెరికా పౌరులు ఇప్పటికే తమ గుండెల్లో పెట్టుకోగా.. ఆ దేశంలో భారత డాక్టర్లు చేస్తున్న సేవలకు ఘనంగా కృత‌జ్ఞతలు చెప్తున్నారు.అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న వేళ.. భారత సంతతికి చెందిన వైద్యులు విశేష సేవలు అందిస్తున్నారు. సౌత్ విండ్‌సార్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ఉమా మధుసూదన్‌కు అమెరికా సమాజం ఏవిధంగా సెల్యూట్ చేస్తుందో ఈ వీడియోలో చూడవచ్చు..కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఉమా మధుసూదన్ ఏళ్లుగా అమెరికాలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. కోవిడ్-19 పంజా విసురుతున్న వేళ కీలక సేవలు అందిస్తున్నారు. యూఎస్ పౌరులు డాక్టర్ ఉమా మధుసూదన్ ఇంటి ముందుకు చేరుకొని ఆమెకు థ్యాంక్స్ చెప్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో భారత సంతతికి చెందిన సుమారు 50 వేల మంది డాక్టర్లు సేవలు అందిస్తున్నట్లు ఓ అంచనా.

Related Posts