YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయసాయి యూ టర్న్ వెనుక...

విజయసాయి యూ టర్న్ వెనుక...

విజయసాయి యూ టర్న్ వెనుక...
విజయవాడ, ఏప్రిల్ 22
బీజేపీ, వైసీపీలు స్నేహంగా ఉంటూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండేలా వైసీపీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడు సార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలసి వచ్చారు. అలాగే బీజేపీ కూడా రాజ్యసభలో బిల్లులను నెగ్గించుకునేందుకు అవసరమైన బలం కోసం వైసీపీతో స్నేహ పూర్వకంగానే ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు జగన్ తో సానుకూల ధోరణిలోనే ఉన్నారు.అయితే హఠాత్తుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎందుకు విమర్శలుకు దిగుతున్నట్లు? 20 కోట్లు టీడీపీ నుంచి తీసుకున్నారని ఎందుకు ఆరోపించినట్లు. వ్యక్తిగతంగా కన్నా లక్ష్మీనారాయణనే ఎందుకు టార్గెట్ చేసినట్లు? ఇవన్నీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కన్నా లక్ష్మీనారాయణ తొలుత వైసీపీ పట్ల సాఫ్ట్ గానే ఉండేవారు. అయితే గత ఏడు నెలల నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చిందంటున్నారు. కేంద్ర నాయకత్వం అనుమతి లేకుండానే ఆయన వైసీపీపై విరుచుకుపడుతున్నారని బీజేపీ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు.వైసీపీ కూడా ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, ఢిల్లీ బీజేపీ పెద్దలక మధ్య సయోద్య కుదిర్చింది కన్నా లక్ష్మీనారాయణ అని బలంగా వైసీపీ విశ్వసిస్తుంది. అంతేకాకుండా కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీకి వెళ్లి ప్రభుత్వంపై ఫిర్యాదులు తరచూ చేస్తుండటాన్ని కూడా వైసీపీ సీరియస్ గా తీసుకుంది. మూడు రాజధానుల అంశం, శాసనమండలి రద్దు వంటి విషయాల్లో కన్నా ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసి వచ్చారని వైసీపీ ఆరోపిస్తుంది.టీడీపీ అధినేత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ ఇదంతా చేస్తున్నారని వైసీపీ ప్రధానంగా చేస్తున్న ప్రచారం. కన్నాను ఇలాగే వదిలేస్తే బీజేపీ, జనసేన, టీడీపీ మైత్రికి మూలం అవుతారని కూడా వైసీపీ భావిస్తుంది. కన్నా లక్షీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే మూడు పార్టీలు ఏకమవుతాయన్న అంచనాలో వైసీపీ ఉంది. అందుక కన్నా లక్ష్మీనారాయణను వైసీపీ టార్గెట్ చేసిందంటున్నారు. ఢిల్లీ అగ్రనేతలతో మాట్లాడుకున్నాకే వైసీపీ కన్నాపై విమర్శలకు దిగిందన్న ప్రచారమూ ఉంది. మొత్తం మీద బీజేపీలో కన్నా ఒక్కడే టార్గెట్ అవ్వడానికి వైసీపీకి ప్రత్యేక కారణాలు లేకపోలేదంటున్నారు.
 

Related Posts