YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

నాలుగు నగరాలు..కరోనా విలయతాండవం

నాలుగు నగరాలు..కరోనా విలయతాండవం

నాలుగు నగరాలు..కరోనా విలయతాండవం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22
దేశంలో నాలుగు నగరాలు కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కల్గించే అంశమే. అయితే ప్రధానంగా నాలుగు నగరాలు కేంద్ర ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్నాయి. ఆందోళనకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్, ముంబయి, ఇండోర్, ఢిల్లీ నగరాలు కరోనా పాజిటివ్ కేసుల మూలాలుగా మారాయి. ఆ యా రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ ఈ నగరాల్లోనే ఉండటం గమనార్హం.దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తుంది. దాదాపు 19వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో నాలుగువేలు దాటింది. మహారాష్ట్రలో తొలి నుంచి కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ముంబయి ధారవి మురికి వాడకు కూడా వైరస్ వ్యాప్తి చెందడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు మూడు వేల కేసులకు పైగానే ముంబయి నగరంలో నమోదయ్యాయి.
ఇక మధ్యప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి. మధ్యప్రదేశ్ లోనూ కేసుల సంఖ్య రెండువేలకు సమీపంలో ఉంది. ఒక్క ఇండోర్ నగరంలోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటం ఆందోళన కల్గించే విషయమే. ఇండోర్ అనేక ప్రాంతాల్లో కంటెయిన్ మెంట్ ఏరియాలను ప్రకటించారు. ఇక ఢిల్లీ సంగతి చెప్పనక్కర లేదు. ఢిల్లీలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. ఈ కేసులన్నీ ఢిల్లీ నగరంలోనివే కావడం గమనార్హం.తెలంగాణలో దాదాపు 900 కేసులు నమోదయితే అందులో సగం కేసులు హైదరాబాద్ నగరంలోనివే. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ గడువును మే 7వ తేదీ వరకూ పొడిగించారు. దేశంలో కొంత సంతోషించే విషయం ఏంటంటే…? దేశంలోని సగం జిల్లాల్లో కరోనా కేసులు అస్సలు నమోదు కాకపోవడం. వందకు పైగా కేసులు కేవలం దేశవ్యాప్తంగా 18 జిల్లాల్లోనే నమోదయ్యాయి. ఈ నాలుగు నగరాల్లో వైరస్ ను ఎలా కంట్రోల్ చేయాలన్న దానిపై కేంద్రం కూడా కసరత్తులు ప్రారంభించింది
 

Related Posts