YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గొర్రెలకు ప్రాణగండం

గొర్రెలకు ప్రాణగండం
మహబూబ్‌నగర్‌ : ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల ఆయుష్షు తగ్గిపోతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవలడంతో అవి మృత్యువాత పడుతున్నాయి. ఆ రెండు జిల్లాల నుంచే..మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు జిల్లాల్లో గొర్రెల పెంపకం అధికంగా సాగుతుంది. కాపరులు ఎక్కువగా అటవీ ప్రాంతంలోనే జీవనం సాగిస్తారు. వర్షాకాలంలో వీటికి పచ్చగడ్డి ఎక్కడ పడితే అక్కడ దొరకటం సహజం. వేసవిలో మాత్రం మందలను ఆయకట్టు ప్రాంతాలకు తీసుకువెళ్తారు. మహబూబ్‌నగర్‌ నుంచి దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, ఖమ్మం, భద్రాచలం మీదుగా తిరిగి సూర్యాపేట, నల్గొండ నుంచి దేవరకొండ మీదుగా మహబూబ్‌నగర్‌ చేరుకుంటారు. దీనికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఈలోగా వేసవి పూర్తవుతుంది. మళ్లీ వర్షాలు కురవటం, పచ్చగడ్డి ఏపుగా పెరగటం జరుగుతుంది. ఇది ఏటా జరిగే తంతే. ఒక్కో మందలో వెయ్యి నుంచి నాలుగు వేల జీవాలుంటాయి. కలుషిత రోడ్డు వెంట వెళ్లే వీటికి మార్గమధ్యలో కనిపించే చెరువులు, కుంటలు, నీటి మడుగుల్లోని తాగు నీరే దిక్కు. కలుషితనీరు తాగడంతో గొర్రెలకు జబ్బులు చేస్తాయి. చాలావరకు కాపరులే సొంత వైద్యం చేసుకుంటారు. ఎక్కడో ఒకచోట వాగులు, నదులు వంటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో మంచినీరు లభ్యమవుతుంది. నిల్వ నీరున్న మడుగుల్లో బ్యాక్టీరియా వృద్ధి చెంది ఉంఉటంది. పైగా రహదారుల పక్కన సాగుచేసే పంట పొలాల్లో గుళికలు, ఇతర రసాయన మందులు చల్లి ఉంటారు. ఆ పంటలను తింటే ఆ జీవాలు చనిపోయే ప్రమాదం ఉన్నట్లే. ముఖ్యంగా నీటినిల్వలున్న మడుగుల్లో జలగలుంటాయి వాటిని తాగిన గొర్రెల కడుపుల్లోకి జలగలు చేరి వాటి రక్తాన్ని పీలుస్తుంటాయి. కొత్త గడ్డి తిన్నా.. ఆయకట్టులో రహదారుల పక్కన కోతలు పూర్తయిన తర్వాత వచ్చే కొత్తగడ్డితో పాటు వాటిని ఆశించిన పరాన్నజీవులను జీవాలు తింటే వాటికి చిటికె రోగం వస్తుంది. దీనిని అరికట్టాలంటే టీకా ఒక్కటే ప్రధాన మార్గం. కాని ఇలా వలస వచ్చే గొర్రెలకు టీకాలు, నట్టలమందు ఇవ్వాలి. టీకాలు చాలా తక్కువగా ఇస్తుంటారు. దీంతో జబ్బులు వీటి చుట్టే ఉంటాయి. అధిక దూరం నడిచినా.. గొర్రెలు పచ్చ గడ్డికి కొన్ని కిలోమీటర్ల కొద్ది నడవాల్సి వస్తుంది. ఈక్రమంలో తిన్న మేతతో వచ్చే శక్తికన్నా నడిస్తే ఎక్కువ శక్తి ఖర్చయి.. బలం కోల్పోయి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా ఏ చిన్న పురుగు కుట్టినా, ఏ వ్యాధి సోకినా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి. పైగా ఎండల్లో గంటల తరబడి తిరగటం, నడవటంతో డీహైడ్రేషన్‌కు గురవుతుంటాయి. తద్వారా వాటికి అంటు వ్యాధులు సోకుతుంటాయి. దీంతో వాటికి సోకే వ్యాధులకు సంబంధించిన మందులను కాపలాదారులే దగ్గరుంచుకుని వాటికి ఇస్తుంటారు. బీటీ పత్తి మొక్కలతో ప్రమాదం.. ఈ రోజుల్లో వలస వెళ్లే గొర్రెలకు రోడ్లపక్కన ఎక్కువగా కనిపించేది పత్తి చేలే. ప్రధానంగా పత్తిచేలకు పురుగు మందుల వాడకం అధికంగానే ఉంటుంది. వాటి అవశేషాలు పత్తిఆకుల్లో, కొమ్మల్లో, కాయల్లో తీవ్రంగా ఉంటుంది. అలాంటి ఆకులు, కాయలను జీవాలు తినటంతో కడుపులో విషప్రభావం పెరిగి ప్రమాదకరంగా తయారై గొర్రెలు చనిపోతున్నాయి.

Related Posts