YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయసాయి యత్నాలపై భగ్గుమంటున్న కాపులు

విజయసాయి యత్నాలపై భగ్గుమంటున్న కాపులు

విజయసాయి యత్నాలపై భగ్గుమంటున్న కాపులు
విజయవాడ ఏప్రిల్ 22
ఇంత కాలం కమ్మ కులం నాయకులను టార్గెట్ చేసిన వైసీపీ ఇప్పుడు కాపు కుల నాయకులపై కూడా బాణాలు వేస్తున్నది. ఈ విషయం తాజాగా కాపు సామాజిక వర్గానికి చెందిన సంఘాల వారు నిశితంగా గమనిస్తూ అప్రమత్తమయ్యారు.వైసీపీ నాయకులు మరీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కాపు నాయకులను టార్గెట్ గా చేసుకుని వారిని అవినీతి పరులుగా ముద్రవేయడాన్ని చూస్తూ ఊరుకుంటే కమ్మ కులానికి పట్టిన గతే తమకూ పడుతుందని కాపు కులస్తులు ఆందోళన చెందుతున్నారు.కమ్మ కులానికి చెందిన వారిని సమాజం నుంచి దూరం చేసే క్రమంలో వైసీపీ నాయకులు అదే పనిగా ప్రచారం చేశారు. ఇప్పుడు అదే విధంగా కాపు కులస్తులను టార్గెట్ చేశారని, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు అంటున్నారు.చిరంజీవితో రెండు సార్లు కలిసినట్లు ఆయనకు విశాఖపట్నంలో స్టూడియోకు స్థలం ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వైసీపీ, జన సేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆయన నుంచి వేరు చేసే ప్రయత్నం చేసింది. చిరంజీవి కూడా రాష్ట్ర ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కొన్ని వ్యాఖ్యలు చేస్తే వాటిని వైసీపీ నేతలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు.ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై చౌకబారు వ్యాఖ్యలు చేశారని కాపు కులస్తులు భావిస్తున్నారు. ఆ తర్వాత నాగబాబును కూడా వైసీపీ టార్గెట్  చేసుకుంది. ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ను టార్గెట్ చేసుకున్నారని ఇది కేవలం తమ సామాజిక వర్గంపై జరుగుతున్న దాడి అని కాపు సంఘాల వారు అంటున్నారు.కన్నా లక్ష్మీనారాయణ ను అవినీతిపరుడుగా చిత్రీకరించే సాహసాన్ని విజయసాయి రెడ్డి చేయడంతో వైసీపీ గేమ్ ప్లాన్ అర్ధం అవుతున్నదని వారు అంటున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి కాపు కుల సంఘాల పెద్దలు ఒక్కటిగా వ్యూహం రూపొందించుకోకపోతే రాబోయే రోజుల్లో కాపు కులం కూడా తనకున్న విలువను కోల్పోవాల్సి వస్తుందని కాపు యువజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. వైసీపీ కాపు కులస్తులపై జరుపుతున్న దాడిని రాజకీయాలకు అతీతంగా ఎదుర్కోవాల్సి ఉందని ఇదే ఎజెండాగా విజయవాడ, తిరుపతి, విశాఖ పట్నం లలో కాపు నాయకుల సమావేశాలు నిర్వహించి పరిస్థితిని వివరించాలని కూడా వారు భావిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత కాపు సంఘాల సమావేశం జరిగే అవకాశం ఉందని కాపు సంఘం నాయకులు తెలిపారు.

Related Posts