Highlights
- నటీనటులు: నితిన్, మేఘా ఆకాశ్, మధునందన్, రావు రమేశ్ తదితరులు
- మ్యూజిక్: ఎస్.ఎస్ తమన్
- ప్రొడ్యూసర్: త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్
- స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య
టాలీవుడ్ లో హిట్లొచ్చినా.., ఫ్లాపులొచ్చినా నార్మల్ గా ఉండే వ్యక్తి నితిన్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్లిచ్చి ఆ తర్వాత ఫ్లాపులతో డీలాపడినా వెనక్కితగ్గలేదు. పవన్ కల్యాణ్ ని ఆరాధించే నితిన్.. ఇప్పుడు పవన్ ప్రొడక్షన్లోనే సినిమా తీశాడు. పవర్ స్టార్ తో పాటు త్రివిక్రమ్ కూడా సినిమాకు నిర్మాత వ్యవహరించడంతో ఛల్ మోహన రంగాపై హైప్ బాగా పెరిగింది. మరి ఛల్ మోహనరంగా ఎలా ఉంది..?
స్టోరీ: మోహన్ రంగ(నితిన్) చిన్నప్పుడే మేఘ (మేఘా ఆకాశ్)ను ఇష్టపడతాడు. కానీ ఆమె అమెరికా వెళ్లిపోతుంది. దీంతో మేఘా కోసం అమెరికా వెళ్లాలని డిసైడ్ అవుతాడు. నానా తిప్పలు పడి అమెరికా వీసా సంపాదించి అమెరికా వెళ్తాడు. అక్కడ మేఘను కలిసినా.. చిన్నప్పటి రంగా అని తెలియదు. ఇద్దరి మధ్య
లవ్ పుట్టినా.. ఆ తర్వాత విడిపోతారు. ఇద్దరు లవ్ లో ఎలా పడ్డారు.? ఎందుకు విడిపోయారు..? మళ్లీ ఎలా కలిశారు అనేదే స్టోరీ.
ఎలా ఉంది: స్టోరీ త్రివిక్రమ్ అందించనదే అయినా అంతా రొటీన్ గా సాగింది. ఓ నార్మల్ స్టోరీకి సరదా సన్నివేశాలు జోడించి సినిమా తీశారు. హీరో పాత్ర చిత్రీకణ.. యూఎస్ వెళ్లడానికి అతను పడే పాట్లు బాగా నవ్విస్తాయి. ఈ సీన్లను కూడా బాగా తీశారు. రంగ, మేఘల మధ్య జరిగే రోడ్ ట్రిప్ సరదాగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా పస లేకపోయినా.. సరదా సీన్లన్నీ ప్రేక్షకులను నవ్విస్తాయి. అమెరికా లొకేషన్స్, మ్యూజిక్, కామెడీ సీన్లతో టైమ్ పాస్ అవుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం స్లోగా సాగింది. రంగ, మేఘ విడిపోయిన తర్వాత.. హీరో ఊటీ వెళ్లిన తర్వాత గానీ సినిమా పట్టాలెక్కలేదు. క్లైమాక్స్ ముందు వచ్చే పార్టీ సీన్... సెకండ్ హాఫ్ కు ప్లస్ పాయింట్. స్టోరీలో యాక్షన్ లేకపోయినా ఓ మంచి ఫైట్ ను చూపించారు. క్లైమాక్స్ రొటీన్ గా ఉన్నా.. స్టోరీకి కరెక్ట్ ఎండింగ్ ఇచ్చారు.
ఎలా చేసారు..?: రంగాపాత్రలో నితిన్ బాగా చేశాడు. వీసా కోసం పాట్లు పడే సీన్స్ లో కామెడీ పండించాడు. సినిమా మొత్తాన్ని నితినే భుజాలపై వేసుకున్నాడు. హీరోయిన్ మేఘా ఆకాష్ ఫర్వాలేదనిపించింది. సినిమాలో గ్లామర్ గా కనిపించింది. హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రిగా బాగా సాగింది. రావు రమేశ్, నరేశ్, మధునందన్, నర్రా శ్రీనివాస్‌కు మంచి పాత్రలు దక్కాయి. తమన్ సంగీతం ఆకట్టుకుంటుంది. ‘నువ్వు పెద్దపులి’ పాట మాస్‌కు నచ్చుతుంది. అమెరికా లొకేషన్లు, ఊటీ అందాల వల్ల ఈ కథకు కొత్త ఫ్లేవర్ వచ్చింది. ఛాయాగ్రహణం ఉన్నత స్థాయిలో ఉంది. డైలాగ్స్ తో డైరెక్టరర్ అదరగొట్టాడు. కొన్ని సీన్లు త్రివిక్రమ్ మార్క్ తో సాగాయి. ఐతే సెకండ్ హాఫ్ పై కొంచెం దృష్టిపెడితే బాగుండేది.
ప్లస్ పాయింట్
+ నితిన్, మేఘా ఆకాశ్
+కామెడీ, డైలాగులు
మైనస్ పాయింట్లు
- రొటీన్ స్టోరీ