కిమ్ జో్ంగ్... ఏమయైపోయాడు...
ప్యాంగాంగ్, ఏప్రిల్ 23
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చనిపోయినట్లు అమెరికా మీడియా కోడై కూస్తోంది. ఇటీవలే గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న కిమ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు అంతర్జాతీయ పత్రికలు సయితం ప్రముఖంగా అచ్చు వేశాయి. ఇంతకీ నియంత కిమ్ మరణించాడా? బతికున్నాడా? అన్నది తెలియరాలేదు. కిమ్ జోంగ్ ఉన్ మరణంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరణించారని కొందరు, బతికి ఉన్నాడని మరికొందరు చెబుతున్నారు. ఉత్తర కొరియా మాత్రం ఇంకా అధికార ప్రకటన చేయలేదు.ఉత్తర కొరియా అధ్కక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు లేని అలవాట్లు లేవు. అన్ని దురలవాట్లు పుష్కలంగా ఉన్నాయి. చైన్ స్మోకర్ గా పేరు. భారీ కాయం. దీంతో ఆయన గుండె సంబంధిత వ్యాధితో గత కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఈ నెల రెండో వారంలో కిమ్ గుండెకు శస్త్ర చికిత్స జరిగిందంటున్నారు. అయితే శస్త్ర చికిత్స ఫెయిల్ కావడంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారని, బ్రెయిన్ డెడ్ అయ్యారన్న కథనాలు విన్పిస్తున్నాయి.కిమ్ జోంగ్ ఉన్ నియంత. తప్పు చేసిన వారిని కాల్చి పడేసే మనస్తత్వం ఉన్న లీడర్. ఇక ప్రపంచ దేశాలను అణ‌్యాయుధాలతో బెదిరించే నేత. చిన్న దేశానికి అధిపతి అయినా ప్రపంచాన్ని శాసించాలనుకునే శాడిస్ట్ లీడర్ కిమ్. అలాంటి కిమ్ మరణించారన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజానికి కిమ్ పై ఈ ప్రచారం జరగడానికి కారణాలు లేకపోలేదు. గత కొంతకాలంగా ఆయన కన్పించడం లేదు.ఉత్తరకొరియా వ్యవస్థాపక అధ్యక్షుడు కిమ్ సంగ్ జయంతి ఉత్సవాలకు కూడా కిమ్ డుమ్మా కొట్టారు. ఏటా ఆర్భాటంగా జరిగే తన తాత జయంతి ఉత్సవాలకు కిమ్ తప్పనిసరిగా హాజరవుతారు. అయితే ఈనెల 15వ తేదీన జరిగిన కార్యక్రమానికి కిమ్ హాజరుకాకపోవడంతోనే అనుమానం మరింత బలపడింది. అయితే ఉత్తరకొరియా మాత్రం కిమ్ మరణాన్ని ధృవీకరించలేదు. కిమ్ తర్వాత ఎవరు నాయకత్వం వహిస్తారన్న దానిపై చర్చ జరుగుతుండటం వల్లనే అధికార ప్రకటన వెలువడటం లేదన్న వార్తలు కూడా వస్తన్నాయి. కిమ్ సోదరికి దేశపగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయన్నది అంచనా. మొత్తం మీద కిమ్ మరణించాడా? బతికున్నాడా? అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.