YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వలస కూలీలు..చాలా గ్రేట్..

వలస కూలీలు..చాలా గ్రేట్..

వలస కూలీలు..చాలా గ్రేట్..
జైపూర్, ఏప్రిల్ 23
రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని ఓ పాఠశాలలో వలస కూలీలను క్వారంటైన్లో ఉంచారు. రోజుల తరబడి ఖాళీ ఉండలేక.. గ్రామస్థుల సాయంతో వారు ఆ బడికి రంగులేసి తమను ఆదరించిన ఊరి రుణం తీర్చుకున్నారు.కరోనా లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు పడుతున్న ఇబ్బందుల గురించే ఇప్పటి వరకూ కథనాలు చదివాం. కానీ ఇది అందుకు పూర్తి విరుద్ధమైన కథనం. బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి.. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వేలాది మంది కూలీలు కాలినడక సొంత రాష్ట్రాలకు పయమైన సంగతి తెలిసిందే. వీరు వైరస్ వాహకాలుగా మారే ప్రమాదం ఉండటంతో.. వలస కూలీలను ఎక్కడిక్కడే ఆపేయాలని.. వారికి ఆహారం, వసతి సమకూర్చాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.దీంతో చాలా చోట్ల అధికారులు వలస కూలీలకు పాఠశాలల్లో, ఫంక్షన్ హాళ్లలో వసతి కల్పిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు లాక్‌డౌన్ కారణంగా రాజస్థాన్‌ నుంచి సొంతూళ్లకు బయల్దేరారు. కానీ సికార్‌లోనూ వారిని ఆపేసిన అధికారులు.. ఓ స్కూళ్లో వారిని క్వారంటైన్‌లో ఉంచారు.పని చేయడం బాగా అలవాటైన ప్రాణాలు కదా.. తిని ఖాళీగా కూర్చుంటే వారికి ఏం తోచలేదు. తాము బస చేస్తున్న బడి గోడలకు పెయింటింగ్ పాత బడిన విషయాన్ని గమనించిన వాళ్లు.. బడి గోడలకు పెయింట్ వేస్తామన్నారు. ఇదే విషయాన్ని సర్పంచ్‌, ఇతర గ్రామస్థులకు చెప్పగా.. వారు పెయింట్, బ్రష్‌లు సమకూర్చారు. ఇంకేం.. కొద్ది రోజులు కష్టపడి బడి గోడలకు పెయింట్‌ వేశారు. దీంతో 9 ఏళ్ల తర్వాత ఆ బడి కొత్తగా మెరిసిపోయింది.బడికి రంగులేసినందుకు గ్రామస్థులు డబ్బులు ఇవ్వబోగా.. క్వారంటైన్లో ఉన్నవారు సున్నితంగా తిరస్కరించారు. మమ్మల్ని మీ ఊళ్లో ఉంచుకొని చక్కగా ఆదరించారు. దానికి రుణం తీర్చుకోనీయండి అని వారు బదులిచ్చారు. క్వారంటైన్‌లో ఉండటాన్ని చాలా మంది శిక్షగా భావిస్తున్నారు. కానీ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేద్దాం.. ఖాళీగా తిని కూర్చోవద్దన్న ఈ వలస కూలీల తపన అందర్నీ ఆకట్టుకుంటోంది.
 

Related Posts