YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

చైనాలో కరోనా వైరస్... జంతువులపై సక్సెస్

చైనాలో కరోనా వైరస్... జంతువులపై సక్సెస్

చైనాలో కరోనా వైరస్... జంతువులపై సక్సెస్
బీజింగ్, ఏప్రిల్ 23
చైనాలోని వుహాన్‌లో మొదలైన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని భయపెడుతోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడం కోసం దేశాలకు దేశాలకు లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. ఇప్పటికే లక్షలాది మంది కోవిడ్ బారిన ప్రాణాలు కోల్పోయారు. లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి చర్యలు వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి మాత్రమే ఉపయోగపడనున్నాయి. కరోనా నుంచి పూర్తిగా బయటపడటానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఈ దిశగా ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ప్రయోగాలు ఊపందుకున్నాయి. భారత్‌లోనూ కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 70 కరోనా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. 3 వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగాల దశలో ఉన్నాయి. కాగా తాము ఇప్పటికే కోతులు, ఎలుకలపై నిర్వహించిన తొలి దశ వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతం అయ్యాయని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగాల్లో జంతువుల శరీరాల్లో సార్స్. కోవ్ -2 యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి అయినట్లు గుర్తించారు.కోతులకు 3 మైక్రో గ్రాములు, 6 మైక్రో గ్రాముల చొప్పున రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వాటికి కరోనా నుంచి పూర్తిగా లేదా పాక్షికంగా రక్షణ లభించింది. కరోనా కోసం రూపొందించిన ఈ వ్యాక్సిన్ మరో పది రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని ఈ అధ్యయనంలో గుర్తించారు. యూకేలో మనుషులపై ప్రయోగం యూకేలో మనుషులపై కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగం ప్రారంభమవుతుందని ఆ దేశ హెల్త్ మినిస్టనర్ మాట్ హాన్‌కాక్  తెలిపారు.  ప్రయోగంపై మాట్   మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులపై కరోనా వైరస్ వ్యాక్సిన్ 80 శాతం ఫలితాలు విజయవంతం అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిశోధనల్ని విజయవంతం చేసేందుకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు నిర్విరామంగా కృషిచేస్తున్నారన్నారు. ఆక్స్ ఫర్డ్ తో పాటు ఇంపిరీయల్ కాలేజ్ సైంటిస్ట్ లు పరిశోధనలు చేస్తున్నారని, ఇందుకు 20మిలియన్లను కేటాయించినట్లు చెప్పారు.ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు ట్రయల్స్ పూర్తయ్యే లోపల పెద్దమొత్తంలో వ్యాక్సిన్ తయారు చేసేలా ప్లాన్ చేస్తున్నారని, సెప్టెంబర్ నాటికి ఒక మిలియన్ టీకాలు సిద్ధంగా ఉంటాయన్నారు. ఈలోగా కరోనా ను అడ్డుకునేందుకు లాక్ డౌన్ , సోషల్ డిస్టెన్స్ పాటించడమే ప్రత్యామ్నాయ మార్గాలని హెల్త్ మినిస్టర్ తెలిపారు.మాట్ ప్రకటనను  బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ చాంద్ నాగ్‌పాల్  స్వాగతించారు. కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం పరీక్షలు ప్రారంభమవుతున్నాయని, ఆ పరిశోధనలు సానుకూలంగా ఉంటాయన్నారు.  వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అభివృద్ధి చేయడానికి  సమిష్టిగా కృషి చేస్తున్నామని, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాను అడ్డుకుంటామని నాగ్ పాల్ తెలిపారు

Related Posts