ధాన్యం తగలపెట్టుకున్న రైతులు
సిరిసిల్ల ఏప్రిల్ 23
వరిధాన్యం కొనుగోలు లో రైస్ మిల్లర్ల షరతులకు ఆగ్రహించిన అన్నదాత ధాన్యం కుప్పలను పేట్రోల్ పోసి దహనం చేసుకుని తమ నిరసనను తెలియజేసిన సంఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు తమ ధాన్యాన్ని పెట్రోలు పోసి తగలబెట్టుకున్నారు. ప్రభుత్వ నిభంధనలమేరకు వరిదాన్యాన్ని అమ్మడానికి తీసుకువస్తే తాలు పేరుతో క్వింటాలుకు ఐదు నుండి పది కిలోల తరుగు తో కొనుగోలు చేస్తామని, లేకుంటే మేం కొనమంటూ మిల్లర్లు రైతులతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిబంధనలతో మాకు సంభంధం లేదని, మీ ఇష్టముంటే తాలు తరుగుతో అమ్మండి లేకుంటే మీ దిక్కున్న చోట చెప్పుకోండని దుర్బాషలాడుతున్నారని , వరి దాన్యంలో తాలు ఉన్న రైతులకు, లేకుండా తీసుకువచ్చిన రైతులను కూడా రైస్ మిల్లర్లు దగా చేస్తున్నారని ప్రభుత్వాధికారులు తమను ఆదుకుని న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.