కడప : ఆటోలలో నిబంధనలకు మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని పోలీసులు ఎన్నిసార్లు చెబుతున్నా ఆటోవాలాలు మాత్రం మారడం లేదు. మండలంలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోవాలాలు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ అల్లుకున్న పొదలతో గ్రామీణ ప్రజానీకం వణికిపోతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం భయం భయంగా కాలం గడపాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలపరిధిలోని నక్కపల్లె గ్రామంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చుట్టూ పొదలను తొలగించాలని కోరుతున్నారు.కమ్మీలు పట్టుకొని బయటకు నిలుచొని మరీ ప్రజలు ప్రయాణిస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బస్సులు లేకపోవడం, సమయానికి గమ్యం చేరవలసి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీరు ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నారు. పోలీసులు ఇలాంటి రూట్లలో నిఘా ఏర్పాటు చేసి ఆటోవాలాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆటోలలో లగేజీలను తరలిస్తూండటంతో అవి జారినప్పుడు వెనుక వచ్చే వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. పట్టణంలోని రంగబాబుసర్కిల్ వద్ద బుధవారం ఓ లగేజీ ఆటోలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, కనీసం తాడుతో కట్టకుండా చెక్క కొయ్యలను తరలిస్తున్నారు. అసలే పట్టణమంతా ఎక్కడ చూసినా గుంతలమయమైన రోడ్లు ఉన్నాయి. ఆపై ఇలా జాగ్రత్తలు తీసుకోకుండా తరలించడం వల్ల ఏమాత్రం చెక్కలు జారినా వెనుక వచ్చే వాహన చోదకులు ప్రమాదం బారిన పడినట్లే. ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా ఉంది.