ఇసుక ఫిల్టర్ల దందాపై "సైబరాబాద్ ఎస్ఓటి" పోలీసుల దాడి
పోలీసుల అదుపులో నలుగురు
రెండు జేసిబిలు, రెండు ట్రాక్టర్లు సీజ్
రంగారెడ్డి ఏప్రిల్ 23
ఇసుక తోడేళ్ళు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట్ ప్రాంతంలో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. ఒక వైపు ఫిల్టర్ ఇసుకను నేరుగా విక్రయిస్తూనే మరో పక్క నది ఇసుకలో ఇదే ఫిల్టర్ ఇసుకను కలిపి ఒరిజినల్గా అమ్మేస్తూ లక్షలు గడిస్తున్నారు. ఫలితంగా సమీపంలోని వాగుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలలోని భూములు గుంతలమయంగా మారాయి. ఇసుక అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని యత్నించిన రెవెన్యూ అధికారులను, పోలీసులను డబ్బులతోనో, బదిలీల భయంతోనో లోబరుచుకుంటున్నారు. చూసీచూడనట్టు వ్యవహరించాలని మౌఖిక హెచ్చరికలతో కాలం గడుపుతున్నారు. అయితే ఇసుక వ్యాపారంపై ఫిర్యాదులు పెద్దఎత్తున రావడంతో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు నేరుగా రంగంలోకి దిగారు. కేశంపేట్ ఫిల్టర్ ఇసుక మాఫియా వ్యవహారం పరాకాష్టకు చేరింది. గురువారం ఉదయమే సైబరాబాద్ పోలీసులు ఇసుక తోడేస్తున్న తోడేళ్ళ స్థావరాలపై దాడులు నిర్వహించి ఇద్దర్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు 2 జేసిబిలు, 2 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.