విజయవాడ : ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని ఇద్దరు టీడీపీ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేసేశారురాష్ట్రంలో ఖాళీ అయిన మంత్రి పదవుల్లో ఒకదానిని భర్తీ చేశారుగానీ మరో శాఖ ఖాళీగానే ఉంది. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖను నిర్వహించిన కామినేని శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాణిక్యాలరావులు రాజీనామాలు చేయడం… దేవాదాయ శాఖ,ను డిప్యూటీ సీఎం కృష్ణమూర్తికి కేటాయించారు. ఇప్పుడంతా ఖళీగా ఉన్న వైద్య, ఆరోగ్య శాఖను ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఆస్తక్తికరమైన చర్చజరుగుతోంది. ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చినా.. మంత్రి పదవుల కేటాయింపులోనూ అంతగా ప్రాధాన్యం లేని శాఖను అప్పగించడంపై కూడా కళా కొంత ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం. ఆయన అనుచరవర్గం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య, ఆరోగ్యశాఖను కళా వెంకటరావుకే అప్పగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పలువురు నాయకులు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బిజీబిజీగా ఉన్న చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరిపలువురు మంత్రులు రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులను పక్కనపడేసి.. తరుచూ ఈ పదవిని ఎవరికి కేటాయిస్తారనే విషయంపైనే చర్చిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతుంటే వీళ్లు మాత్రం ఈ మంత్రి పదవి విషయం చుట్టే తిరుగుతున్నట్లు విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుత మంత్రుల్లో సీనియర్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఇంధన శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావుకే వైద్య, ఆరోగ్యశాఖను అప్పగించే అవకాశాలు ఉన్నట్లు పలువురు మంత్రులు గుసగుసలాడుకుంటున్నారు. 35ఏళ్ల సుధీర్ఘ రాజకీయ నేపథ్యం.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం.. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన కళా వెంకటరావుకు మొదటి నుంచి కూడా టీడీపీ ప్రభుత్వంలో అనుకున్న స్థాయిలో సముచిత స్థానం దక్కలేదు. అయితే పార్టీ మారడం కూడా ఆయనకు మైనస్.