YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా కంట్రోల్ లో ఉంది

కరోనా కంట్రోల్ లో ఉంది

కరోనా కంట్రోల్ లో ఉంది
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 1409 కొత్త కేసులు నమోదు కాగా.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21,393కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,454 యాక్టివ్ కేసులు ఉండగా.. 681 మరణాలు చోటు చేసుకున్నాయి, 4258 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 28 రోజుల్లో 12 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గత 14 రోజుల్లో 78 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది.మార్చి 23 నాటికి దేశంలో 14,915 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఏప్రిల్ 22 నాటికి 5 లక్షలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్రం తెలిపింది. 30 రోజుల్లో 33 రెట్లకుపైగా కోవిడ్ పరీక్షలు చేపట్టామన్నారు. ఈ టెస్టులు మాత్రమే సరిపోవని.. మరింత ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పర్యావరణ శాఖ కార్యదర్శి, ఎంపవర్డ్ గ్రూప్-2 చైర్మన్ సీకే మిశ్రా తెలిపారు.కరోనా సోక ముప్పును తగ్గించామని, వ్యాప్తిని అరికట్టామని, కేసులు రెట్టింపయ్యే సమయాన్ని పెంచగలిగామని కేంద్రం తెలిపింది. లాక్‌డౌన్ సమయాన్ని భవిష్యత్తుకు సన్నద్ధం కావడానికి ఉపయోగించుకున్నాం అని సీకే మిశ్రా తెలిపారు.

 

Related Posts