YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అనంత రైతులకు కష్టాలు

అనంత రైతులకు కష్టాలు

అనంత రైతులకు కష్టాలు
అనంతపురం, ఏప్రిల్ 24
అతివృష్టి, అనావృష్టి, లేదా ప్రకృతి వైపరీత్యాలు కారణమేదైతేనేం రైతులు నష్టపోవడానికి. ప్రపంచమంతా కరోనా భయంతో ఇళ్లకే పరిమితమవుతుంది. పండ్లు, కాయగూరులు దొరకడమే కష్టంగా మారింది. వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కాని వాటిని పండించిన రైతులు మాత్రం నిలువునా నష్టపోతున్నాడు. అనంతలో లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు పొలాల్లోనే మగ్గిపోతున్నాయి.ఎక్కడ చూసినా కాపుకొచ్చిన పండ్లు తోటలే కనిపిస్తున్నాయి. కాని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. రవాణా వ్యవస్థ స్తంభించడం, మార్కెట్ చేసే అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా మంది రైతులు తమ ఆవేదనను చెప్పుకోలేక పంటను చెత్తదిబ్బల పాలు చేసే వారు కొందరైతే... మరికొందరు పొలాల్లోనే వదిలేస్తున్నారు. కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్నారు అనంతపురం జిల్లాలోని ఉద్యాన పండ్లు తోటల రైతులు.కరోనా ప్రభావంతో అనంతపురం జిల్లా రైతులను కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది అని చెప్పవచ్చు మార్చ్ 23వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగడంతో ఇప్పటికే టమోటాతో పాటు వివిధ  కూరగాయలు రైతులు అదే విధంగా కర్బూజా, కల్లంగిరి అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది, మార్కెట్లోకి తీసుకువెళ్లి అమ్ముకోలేక పొలంలోనే పంటను ట్రాక్టర్ తో దున్నాల్సిన పరిస్థితి ఏర్పడిందిని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మన ప్రపంచంలో ఏ వ్యవస్థ ఆగిపోయినా  రైతులు ఆరుగాలం శ్రమించాల్సిందే. రైతు నాగలి పట్టి పొలానికి వెళ్లకపోతే దేశానికి తిండి ఉండదు. ప్రస్తుతం కరోనా దెబ్బకు మొత్తం వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ప్రజలు ఉద్యోగులు, అన్ని వర్గాల వారు ఇళ్లకే పరిమితమవుతున్నారు. వైద్యుడు, పోలీసులతో సమానంగా రైతు మాత్రం తన విధిని నిర్వర్తిస్తున్నాడు. కాకపోతే వ్యవసాయం జూదంలా మారిపోయిన తరుణంలో ఈ సంక్షోభంలో కూడా రైతులతో చెలాగాటం ఆడుతున్నారు దళారీలు.రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పంటలు సాగు చేస్తుంటే.. వాటిని కొనుగోలు చేసే వారు కనిపించడం లేదు. ప్రస్తుతం దేశంలో రవాణా వ్యవస్థ ఆగిపోవడంతో పంటలు కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ఉద్యాన రైతుల పరిస్థితి చూస్తే కన్నీరు రాకమానదు. జిల్లాలో నీటి వనరులు తక్కువగా ఉన్నా... ఉద్యాన పంటలకు మాత్రం దేశంలోనే ప్రసిద్ధి అనంతపురం జిల్లా. ఇక్కడ పండే పంటలు నాణ్యంగా ఉండటంతో ఇక్కడి నుంచి దేశంలోని ప్రముఖ నగరాలకు, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. కాని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు మార్కెట్ కి  వచ్చి పండ్లు కొనుగోలు చేస్తున్నా... అక్కడి వరకు తరలించే వ్యవస్థ లేకుండా పోయింది. అందుకే వ్యాపారులు కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదు.అనంతపురం జిల్లాలో మొత్తం 2లక్షల 10వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉన్నాయి. వీటిలో అరటిది ప్రధాన భూమిక. వీటిలో బత్తాయి అత్యధికంగా ఉన్నా.. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న పంటల్లో అరటి పంట ప్రధానమైనది. జిల్లాలో 16వేల హెక్టార్లలో అరటి పంట సాగులో ఉంది. మొన్నటి వరకు అరటికి విపరీతమైన గిరాకీ ఉండేది. జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతి అయ్యేది. ఇతర రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేది. కాని కరోనా దెబ్బకి ఇతర దేశాలతో మన దేశంలో లాక్ డౌన్ ఉంది. అరటి ధర దారుణంగా పడిపోయింది. 15రోజుల క్రితం టన్ను అరటి 15 నుంచి 16వేలకు పడిపోయింది. కాని నేడు అదే అరటి మూడు వేలకు ఇస్తామన్నా కొనుగోలు చేసే వారు లేరు. ప్రస్తుతం అరటి గెలలు మోయలేక చెట్లు కూలిపోతున్నాయి. కోసేందుకు కూలీలు కూడా అలాగే వదిలేస్తున్నవారు కొందరైతే.. మరికొందరు పంటను కోసి దిబ్బల పాలు చేస్తున్నారు. ఇక బత్తాయి, బొప్పాయి, దానిమ్మ పంటలు కూడా కోతకు వచ్చాయి. వీటికన్నా ముఖ్యంగా వేసవిలో మంచి గిరాకీ ఉంటుందన్న ఉద్దేశ్యంతో కర్భూజ, పుచ్చకాయ పంటలు బాగా సాగు చేశారు. అవి కోతకు వచ్చాయి. అయితే ధరలు అమాంతం పడిపోయాయి. కనీసం పంటను కోసి మార్కెట్ కు తరలించే ఖర్చులు కూడా రాకపోవడంతో పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు రైతులు. జిల్లా వ్యాప్తంగా మామిడి కూడా 50వేల హెక్టార్స్ పైగా సాగు అవుతుంది ,ఏప్రిల్ నుంచి దిగుబడి మొదలవ్వుతుంది,కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో ఎక్కడి పండ్లు అక్కడే చెట్లు పైనే ముగ్గిపోతుండంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కనీస మద్దతు ధర ప్రకటించాలని మామిడి రైతులు కోరుతున్నారు. అయితే ఈ పరిస్థితి పై అధికారులు ఆలస్యంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే కర్బూజా, పుచ్చకాయప్రధానంగా అరటి వంటి చాలా ఎకరాల్లోని పంటను రైతులు వదులుకోగా.. అధికారులు ఇప్పుడు పంటను కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తామంటున్నారు. అంతే కాకుండా పంట రవాణాకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలతో అనుమతి తీసుకుంటామని అంటున్నారు,క్షేత్ర స్థాయిలో ఇవి ఆచరణకు నోచుకోవడంలేదని ఉద్యాన రైతులు రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే అధికారులు స్పందించడం ఆలస్యమైంది. దీనిపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే అనంత ఉద్యాన రైతులు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి ఉండదనే చెప్పాలి.
 

Related Posts