YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

హైద్రాబాద్, ఏప్రిల్ 24, (న్యూస్ పల్స్) కరోనా మహమ్మారి గుబులు రేపుతోంది... ఎప్పుడు... ఎక్కడ... ఎలా వైరస్‌ సోకుతుందో తెలియని భయంతో ప్రజలు ఇండ్లలోనే ఉంటున్నారు. ఇదే అదునుగా సైబర్‌ నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌లో మద్యం సరఫరా చేస్తామని కొందరు... డెబిట్‌ కార్డును అప్‌డేట్‌ చేస్తామని మరికొందరు అందినకాడికి దండుకుంటున్నారు. ఇంకొందరు కరోనా వైరస్‌ నివారణకోసం ఇచ్చే విరాళాలను సైతం వదలడం లేదు. మరికొన్ని ఘటనలో మీ మేయిల్‌ హ్యాక్‌ అయిందని బ్లాక్‌ మేయిల్‌ చేస్తున్నారు. దాంతో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా లాక్‌డౌన్‌లో సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.మద్యం ఆన్‌లైన్‌లో దొరుకుతుందని చెబుతూ వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌లలో పోస్టులు పెడుతున్నారు. ఫోన్‌ నెంబర్లు ఇస్తూ కొన్ని వైన్‌షాపు పేర్లు కూడా పెడుతు న్నారు. దాంతో చాలా మంది ఆ ఫోన్‌ నెంబర్‌లకు కాల్‌ చేస్తున్నారు. అయితే ముందు అకౌంట్‌లో డబ్బులు వేయమంటున్నారు. తీరా డబ్బులు వేసిన తర్వాత వారి ఫోన్‌ నెంబర్లు స్విచ్‌ ఆఫ్‌గా వస్తున్నాయి. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాతే వైన్‌ షాపులు పూర్తి స్థాయిలో తెరుచు కుంటాయని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ సైబర్‌ నేరస్తులు అమాయకులను నమ్మిస్తున్నారు. మందు బాబుల బలహీనతలను ఆసరాగాచేసుకుని కొంతమంది ఇలాంటి మోసాలకు పాల్పడతున్నారు. 15 రోజుల్లోనే రూ.2 లక్షలకు పైగా సైబర్‌ నేరస్తులు దండుకున్నారు. మోసపోయిన బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.ఎస్‌బీఐ బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామని నగరానికి చెందిన ఓ మహిళను సైబర్‌ నేరస్తులు నమ్మించారు. అకౌంట్‌ను అప్‌డేట్‌ చేస్తున్నామని నమ్మించి అమె డెబిట్‌ కార్డు, ఎస్‌బీఐ బ్యాంక్‌ యాప్‌ సీక్రెట్‌ నెంబర్‌ తీసుకున్నారు. వెంటనే ఆమె అకౌంట్‌లో నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రూ.5లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసునమోదు చేశారు. ఇదిలావుండగా బేగంపేట్‌కు చెందిన కమలేష్‌ అనే వ్యక్తికి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరస్తులు రూ.70వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు.మానవతా ధృక్పథంతో కరోనా బాధితులకు తన వంతు సాయం చేయాలని నగరానికి చెందిన వేణు గోపాల్‌ ఆలోచించారు. తన అకౌంట్‌ నుంచి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఆన్‌లైన్‌ ద్వారా రూ.10,000 నగదు బదిలీ చేశాడు. అయినా తన అకౌంట్‌ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ కాకపోవడంతో ఆన్‌లైన్‌లోని ఓ నెంబర్‌ను సంప్రదించాడు. అదే అదునుగా భావించిన సైబర్‌ నేర స్తులు క్యూఆర్‌ కోడ్‌ను తెలుసుకుని వేణుగోపాల్‌ అకౌంట్‌ నుంచి రూ.1లక్ష ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. ఇదిలావుండగా ఒక్క అక్షరం పేరుతో పీఎం రిలీఫ్‌ ఫండ్‌ను కొట్టేస్తున్నారు. విషయాన్ని గమ నించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సుమోటోగా కేసు న మోదు చేసుకుని ఆ వెబ్‌సైట్‌ను బ్లాక్‌చేయించగలిగారు. అమాయకులను టార్గెట్‌ చేసుకుంటున్న సైబర్‌ నేరస్తులు మీ మేయిల్‌ హ్యాక్‌ అయిందని బెదిరిస్తున్నారు. మీరు ఫారెన్‌ వెబ్‌సైట్‌ను వీక్షిస్తున్నారని, మీ వివరాలు, మీ ఫోటోలు మా వద్ద ఉన్నాయని నమ్మిస్తున్నారు. వాటిని మీ బంధులకు, స్నేహితులకు ఇంట్లో వారికి పంపిస్తామని ఆందోళనకు గురి చేస్తున్న సైబర్‌ నేరస్తులు అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు. ఇదే తరహాలో సోమాజీగూడకు చెందిన ఓ డాక్టర్‌కు ఫోన్‌ చేసిన సైబర్‌ నేరస్తులు మీ మేయిల్‌ హ్యాక్‌ అయిందని చెప్పారు. మీ వివరాలు మా వద్ద ఉన్నాయని చెప్పిన నేరస్తులు పెద్దఎత్తున డబ్బులు డిమాండ్‌ చేశారు. అనుమానం వచ్చిన డాక్టర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే తరహాలో గత 10 రోజుల్లోనే ఐదు ఫిర్యాదులు వచ్చినట్టు సైబర్‌క్రైమ్‌ పోలీసులు తెలి పారు. ఎవరైనా మేయిల్‌ హ్యాక్‌ అయిందని బెదిరిస్తే వెం టనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిం చారు. తెలియని వ్యక్తులు పంపించే మేయిల్స్‌కు, ఫోన్‌ నెంబ ర్లకు సమాధానం ఇవ్వక పోవడమే మేలని సూచించారు.

Related Posts