YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ రంగులమారి తెలివితేటలూ! ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ రంగులకు కొత్త అర్దాలు !!

వైసీపీ రంగులమారి తెలివితేటలూ! ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ రంగులకు కొత్త అర్దాలు !!

  
వైసీపీ రంగులమారి తెలివితేటలూ! ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ రంగులకు కొత్త అర్దాలు !! 
 ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అన్ని భవనాలకు పార్టీ రంగులు వేశారు. ఈ విషయం మీద కొంత మంది కోర్టుకు వెళ్ళడంతో కోర్టు  రంగులు మార్చమని చెప్పింది. దీంతో  ప్రభుత్వ భవనాలకు రంగులు వేసే విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మార్గదర్శకాలు విడుదల చేసినట్టు సమాచారం. గ్రామ పంచాయితీ కార్యాలయాలకు మట్టి రంగుతో పాటు తెలుపు, నీలం, ఆకుపచ్చని రంగులు వేయాల్సిందిగా సూచిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా నాలుగు రంగులకు అర్ధాలు చెబుతూ ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది.రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు , పంచాయితీ కార్యాలయాలకు ఇతర కట్టడాలకు వేసే రంగుల విషయంలో మార్గదర్శకాలు జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   మట్టిని సూచిస్తూ టెర్రకోట రంగు, పాడి పంటలకు సూచనగా ఆకుపచ్చ, నీలి విప్లవానికి సూచనగా నీలం రంగు, పాల విప్లవానికి సూచనగా తెలుపు రంగులు వేయాల్సిందిగా  సూచనలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన కట్టడాలు, భవనాలకు జాతీయ బిల్డింగ్ కోడ్ మేరకు ఈ  రంగులు వేయాల్సిందిగా సూచనలు చేశారు. ఇక ప్రభుత్వ భవనాలపై ఏ రాజకీయ పార్టీకి చెందిన చిహ్నాలు, రంగులు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ ప్రభుత్వ విభాగం, స్థానిక సంస్థలు ఇతర ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించిన రంగును ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంచుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇందులో మూడు రంగులు మళ్ళీ వైసీపీ జెండా రంగులే, కొత్తగా టెర్రకోట రంగు ఒకటి యాడ్ అయింది. ఈ రంగులమారి తెలివితేటలఫై  సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు

Related Posts