డయాలసిస్ రోగుల అవస్థలు
హైదరాబాద్ ఏప్రిల్ 24
మలక్ పేట లోని ఇండో-యూఎస్ ఆసుపత్రి మూసీ వేయడంతో షుగర్ వ్యాధి రోగులకు డయాలసిస్ లేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్న ఒక నర్సుకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న కారణంగా అధికారులు ఈ ప్రాంతాన్ని క్వారంటైన్ ప్రాంతంగా ప్రకటించి మూడు రోజుల క్రితమే నియంత్రణ చర్యలు చేపట్టారు. దింతో డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బుందులు పడుతున్నారు. ఈ ఆసుపత్రిలో భగవాన్ మహావీర్ డయాలసిస్ సెంటర్ స్వచ్ఛంద సంస్థ అతి తక్కువ దరలలో నిత్యం 30 మంది షుగర్ రోగులకు సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులు మూసి వేయడంతో రోగులు డయాలసిస్ కు దూరం అవుతున్నారు. ఇతర ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు చెలించలేని రోగులు డయాలసిస్ కు దూరం అవుతున్నారు. ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రి లకు వెళ్లినా, రద్దీ కారణంగా కొత్త రోగులను అనుమతించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుం టున్నారు.