ఫోన్ కొడితే ఇంటికే నాటుసారా...
చాప కింద నీరులా అక్రమ మద్యం..
నందికొట్కూర్ ఏప్రిల్ 24
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు భవిష్యత్తులో ఎలా ఉంటుందో కరోనా కాలం కళ్లకు కట్టి చూపిస్తోంది. దశలవారీగా అమలవుతున్న నిషేధం, కరోనాతో హఠాత్తుగా సంపూర్ణ నిషేధంగా మారింది. అంటే ఎక్కడికక్కడ అంతా బంద్ అయిపోయిందనుకుంటే పొరపాటే. సంపన్నులు కోరుకున్న బ్రాండ్ ఇళ్ళకే రహస్యంగా సరఫరా అవుతోంది. మద్యతరగతి కోసం చీప్ సరకు సరిహద్దులు దాటి వచ్చేసింది. పేదవాళ్ళ దాహం తీర్చడానికి నాటుసారా ఘాటు పల్లెల్లో గుప్పుమంటోంది. కాకపోతే, అందుబాటులో ఉన్నపుడు దొరికే ధరకు పదిరెట్లు ఎక్కువ పెట్టి ఇప్పుడు కొనాల్సి వస్తోంది. ఎక్సైజ్ దాడుల్లో దొరుకుతున్న సారా పొట్లాలూ, మద్యం సీసాలూ చూస్తుంటే క్రూర కరోనా వైరస్ కూడా మందుప్రియుల ముందు బలాదూరే అని నిరూపణ అవుతోంది. ఈ దొంగ మందు వ్యాపారంలో పెద్ద వాటా గ్రామ నాయకులకు సంబంధించి ఉండడం విశేషం. గద్దె మీద కూర్చుని చెప్పే మాటలకూ, చేస్తున్న చేతలకూ పొంతనే లేదని విచ్చలవిడి నాటుసారా మద్యం వెల్లడిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో జిల్లాలో కూడా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీన్ని కొంతమంది ఇది అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఎమ్మార్పీకంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇంత ధర వెచ్చించలేని సామాన్యుడు సారావైపు మొగ్గుచూపుతున్నాడు. దాంతో నందికొట్కూరు నియోజకవర్గంలో సారా వ్యాపారమూ జోరుగా సాగుతోంది. ఈ దందాలో గ్రామ నాయకులూ తమ హవా చూపుతున్నారు. కొందరు ప్రత్యక్షంగా అక్రమ మద్యం వ్యాపారం చేస్తుండగా.. మరికొందరు అనుచరులతో చేయిస్తున్నారు. అక్రమ మద్యాన్ని తెచ్చి అనుచరులతో రెట్టింపు ధరలకు విక్రయిసున్నాడు. రూ.950 ఉన్న ఫుల్ బాటిల్ రూ.3వేలకు. 1200 ఉన్న రాయల్ స్ట్రాంగ్ 3500. బెండర్ స్ప్రైడ్ ఫుల్ బాటిల్ 5000 అమ్ముతున్నారు. మందు దొరికితే చాలనుకుంటున్న మందుబాబులు ధరల రెట్టింపును అస్సలు పట్టిం చుకోవడం లేదు. ప్రస్తుతం ఇలాంటివారి వద్ద కూడా మద్యం దొరక్కపోవడంతో సారాకు గిరాకీ పెరిగింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యా న్ని నిల్వ చేసుకున్న నాయకులు పార్టీ నేతలు లాక్‌డౌన్‌ను అవకాశం చేసుకుని అధిక ధరలకు అమ్ముకుంటున్నాట్లూ. వినికిడి
అధికారుల అండదండలతో చొటమోటా నేతలు, కొందరు ఎక్సైజ్ అధికారులకు తెలిసి తెలియనట్లు గా అండదండలతోనే
నాటు సారా వ్యాపారం జోరుగా సాగుతోంది. అన్ని గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.సారాకూ పెరిగిన గిరాకీ మద్యం దుకాణాలు మూత పడడంతో సారాకు గిరాకీ పెరిగింది. తాలూకాలోలీటరు సారా రూ.400 నుండి రూ.700 పకులుతోందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కోళ్ళభాపురం. మల్యాల. శాతనకోట. బిజినవేముల.నాగ టూరు. కొణిదేల. పీకే ప్రాగటూరు. నెహ్రూ నగర్. పగిడ్యాల. ప్రాతకోట. ఇలా ఎన్నో గ్రామాలు. నియోజకవర్గాల్లో సారా వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతోంది. కృష్ణా నది వెంబడి ఉన్న గ్రామాలలో ప్రక్క రాష్ట్రం లోని తాండాల నుండి రాత్రివేళల్లో గుట్టు చప్పుడు కాకుండా సారా సరఫరా జరుగుతోందీ పగిడ్యాల మండలం లో సారా లీటరు రూ.400 నుంచి రూ. ఒరిజినల్ నాటుసార వెయ్యి వరకు రేటు పలుకుతుంది. సమీపంలోని నందికొట్కూరు నీలి షీకరిపేట. కోళ్ల బాపురం. గూమితంతాండ. ప్రాంతల నుండి సారా రవాణా అధికంగా జరుగుతోంది. ప్రతి గ్రామంలో రోజుకు పది నుండి పదిహేను బిందెల నాటు సార అమ్ముతున్నారు. మల్యాల నుండి ముచ్చుమర్రి వరకు హంద్రీనీవా అప్రోచ్ కెనాల్ నాటు సార అమ్మకానికి నిలయం అయినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.