YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రతి పోలీస్ ఠాణకు Whatsapp!!

ప్రతి పోలీస్ ఠాణకు Whatsapp!!

తెలంగాణ వ్యాప్తంగా  బీట్  పోలీసులకు రంగం సిద్ధమైంది. పోలీస్ శాఖలో వినూత్న మార్పులు చేయాలని నిర్ణయించారు. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఉన్న బీట్‌ పెట్రోలింగ్‌ వ్యవస్థను రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కమిషనరేట్లు, పాత, కొత్త జిల్లా కేంద్రాల్లో అమలు చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే  పోలీస్ శాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన హోంశాఖ ఆ దిశగా అడుగులు వేస్తోంది. అటు టెక్నాలజీ ఉపయోగించుకుంటూ నేరస్థుల జాడను కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది. వల పోలీస్‌ శాఖలో కొత్తగా నియామకమైన 10 వేల మంది కానిస్టేబుళ్లను గ్రామీణ ప్రాంతా ల్లో నియమించి టెక్నాలజీ వినియోగాన్ని విస్తృ తం చేసేలా పోలీస్‌ శాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రతి చిన్న ఘటన నిమిషాల్లో ఉన్నతాధికారులకు తెలిసేలా యాప్స్‌తో అప్‌డేట్‌ చేయనున్నారు. ప్రతి ఠాణాకు ఓ ఫేస్‌బుక్‌ ఖాతా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారుపోలీస్‌ శాఖ కు విద్యార్థులు, యువత సలహాలిచ్చేలా, ఫిర్యా దులు చేసేలా టెక్నాలజీని వినియోగించనున్నా రు. కొత్తగా రానున్న పెట్రోలింగ్‌ వాహనాల్లోనే ట్యాబ్‌లు ఏర్పాటుచేసి.. ఘటనా స్థలినుంచే దర్యాప్తునకు అవసరమైన వివరాలు తెలుసుకునేలా..క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ను మరింత లోతుగా వినియోగించుకోనున్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త కమిషనరేట్లలోనూ పెట్రోలింగ్‌ కోసం ఇన్నోవా కార్ల కొనుగో లుకు పోలీస్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన కమిషనరేట్లలో ప్రతీ ఠాణాకు రెండు చొప్పున పెట్రోలింగ్‌ కార్లు, 8 చొప్పున బ్లూకోల్ట్స్‌ బైకులను అందుబాటులోకి తీసుకురానున్నారు రూరల్‌ ప్రాంతాల్లో ఒక్కో ఠాణాకు ఒక పెట్రోలింగ్‌ కారుతో పాటు నాలుగు బ్లూకోల్ట్స్‌ బైకులు అందజేయనుంది. దీంతో  బీట్స్‌లో ఉండే కానిస్టేబుళ్లు గస్తీ చేపట్టడంతోపాటు  ఘటనా స్థలాలకు చేరుకోవడం ఈజీ కానుంది.

Related Posts