వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి.
కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం, నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది. సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.
ఈ వైశాఖ మాసంలో
ముఖ్యమైన పర్వదినములు
26వ తేది ఆదివారం అక్షయ తృతీయ
27వ తేదీ సోమవారం శ్రీ శంకర జయంతి
28వ తేదీ మంగళవారం శ్రీ రామానుజ జయంతి
మే నెల 3 తేదీ ఆదివారం స్మార్త ఏకాదశి అన్నవరం సత్యదేవుని కళ్యాణం అత్తిలి అన్నవరప్పాడు కాళ్ళకూరు స్వామివారల కల్యాణం
మే నెల 4వ తేదీ సోమవారం వైష్ణవ మాధ్వ ఏకాదశి
మే నెల 6 తేదీ బుధవారం నరసింహ జయంతి
మే నెల 7వ తేదీ గురువారం శ్రీ కూర్మ జయంతి పూర్ణిమ
మే నెల 8వ తేదీ శుక్రవారం అన్నమాచార్య జయంతి
మే నెల 10వ తేదీ ఆదివారం సంకటహర చతుర్థి
మే నెల 14వ తేదీ గురువారం వృషభ సంక్రమణ పుణ్యకాలం
మే నెల 17వ తేదీ ఆదివారం హనుమజ్జయంతి
మే నెల 18వ తేదీ సోమవారం ఏకాదశి
మే నెల 19వ తేదీ మంగళవారం శ్రీ మహీ జయంతి
మే నెల 21వ తేదీ గురువారం మాస శివరాత్రి
మే నెల 22వ తేదీ శుక్రవారం అమావాస్య.