YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని తరలింపుపై విచారణ సర్కార్ ను వివరణ కోరిన న్యాయస్థానం

రాజధాని తరలింపుపై విచారణ సర్కార్ ను వివరణ కోరిన న్యాయస్థానం

రాజధాని తరలింపుపై విచారణ
సర్కార్ ను వివరణ కోరిన న్యాయస్థానం
అమరావతి ఏప్రిల్ 24
 రాజధాని తరలింపుపై జేఏసీ హైకోర్టులో పిల్ పై శుక్రవారం  హైకోర్టులో విచారణ జరిగింది.  రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.  అయితే రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు పాస్ అవ్వకుండా.. రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టబోమని ఏజీ హైకోర్టుకు తెలిపారు.   ఇదే విషయంతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఏజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  అయితే,  ప్రమాణపత్రం దాఖలుకు 10 రోజుల సమయం కావాలని ఏజీ కోరారు. దీంతో హైకోర్టు 10 రోజుల గడువిచ్చింది.  కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.   ఈలోపు రాజధాని తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది. రాజధాని తరలింపును ఆపడం ఎవరి తరమూ కాదని.. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు.  పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఏజీని కోరింది.   అమరావతి పరిరక్షణ సమితి తరపున కార్యదర్శి గద్దె తిరుపతి రావు పిటిషన్ వేశారు.   పిటిషనర్ తరఫున న్యాయవాది ఉన్నం శ్రవణ్ కుమార్ వాదించారు.

Related Posts