YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

న్యాయమూర్తిపై అవినీతి కేసు నమోదు

 న్యాయమూర్తిపై అవినీతి కేసు నమోదు

జగిత్యాల అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మధుపై అవినీతి కేసు నమోదు కు హైకోర్టు ఆదేశించింది. పలు కేసుల్లో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటూ తీర్పులిస్తున్నారనీ అరోపణ. ధనార్జనే ధ్యేయంగా న్యాయవ్యవస్థనే భ్రష్ఠుపట్టించారంటూ పైగా న్యాయవాదులు, క్లైంట్స్ తో ఆయన వ్యవహారశైలి సరిగ్గా లేదన్న ఫిర్యాదుల నేపధ్యంలో మధుపై అవినీతి కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించినట్టు సమాచారం. ఈక్రమంలో జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ లో నివాసం ఉంటున్న మధు ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. హైదరాబాద్ రేంజ్ అడిషనల్ ఎస్పీ రమణ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దాడులలో మెదక్, కరీంనగర్ డిఎస్పీలు కిరణ్ కుమార్, ప్రతాప్, ఎనమిది మంది సీఐలు పాల్గోన్నారు. న్యాయమూర్తి పలు కేసులను కావాలని పక్కదోవ పట్టించి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, ఏకంగా జగిత్యాలలోని న్యాయవాదులు అంతా కూడా ఇటీవలే ధర్నా కూడా చేశారు. మధు తీరును నిరసిస్తూ గత పది రోజులుగా జగిత్యాల బార్ అసోసియేషన్ సభ్యులు విధులకు హాజరుకావడం లేదు.

Related Posts