YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయసాయి..మైండ్ గేమ్

విజయసాయి..మైండ్ గేమ్

విజయసాయి..మైండ్ గేమ్
విశాఖపట్టణం, ఏప్రిల్ 25
జగన్ కి ఆయన నమ్మకమైన అనుచరుడు. జగన్ కుటుంబానికి మూడు తరాలుగా విశ్వాసపాత్రుడు. ఆయన పేరులోనే విజయం ఉంది. ఆయనే విజయసాయిరెడ్డి. గత సాధారణ ఎన్నికల్లో జగన్ గెలవడం వెనక ఆయన చరిష్మా ఎంత ఉన్నా కూడా విజయసాయిరెడ్డి రాజకీయ చాణక్యం కూడా బాగా పనిచేసింది. ఓ విధంగా వైసీపీలో నంబర్ టూ నేతగా ఎదిగిన సాయిరెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన గౌరవాన్నే పొందుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి విమర్శలు, ట్విట్టర్ ద్వారా చేస్తున్న హాట్ కామెంట్స్ ఆయననే కాదు, పార్టీని కూడా ఒక్కోసారి డిఫెన్స్ లో పడేస్తున్నాయి.జగన్ మీద ఈగ వాల్తే ఒప్పుకోను అంటున్నారు విజయసాయిరెడ్డి. అధికారంలో ఉన్న తరువాత ముఖ్యమంత్రి మీద విపక్షాలు రాజకీయ విమర్శలు చేస్తాయి. అది సహజం. ఇక ఏపీలో అయితే అది శ్రుతి మించుతోంది. చంద్రబాబు మొదలుకుని అన్ని పక్షాలూ జగన్ ని గట్టిగానే విమర్శిస్తున్నాయి. ఒక విధంగా ప్రభుత్వ పాలన విషయంలో దైనందిన వ్యవహారాల్లో చొరబడుతున్నాయి. ఏది చేసినా తప్పే అన్నట్లుగా విపక్షాల వైఖరి ఉంది. అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న వారు సహనంతో ఉండాలి. నోటికి ఏది పడితే అది మాట్లాడేస్తూ విపక్షాలను ఏకమొత్తంగా శత్రుపక్షాలను చేసుకోవడం తగదు. కానీ విజ‌యసాయిరెడ్డి ప్రతీ రోజూ ట్విట్టర్ కి పని చెబుతూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.నిన్నటివరకూ తెలుగుదేశాన్ని విజయసాయిరెడ్డి చీల్చిచెండాడారు. జనసేనాని మీద విరుచుకుపడ్డారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఇపుడు బీజేపీ మీద పడ్డారు. ఏకంగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ మీదనే దారుణమైన కామెంట్స్ చేసేశారు. ఆయన‌ ఇరవై కోట్లకు టీడీపీకి అమ్ముడుపోయారని, తెలుగు జాకాల్స్ పార్టీలో ఉన్నారని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఇది బాధకరమే. సాటి రాజకీయ పార్టీ నేతను ఇలా అనడం నోటికి పని చెప్పడమే. దాంతో ఇపుడు బీజేపీ కూడా గట్టిగా రియాక్ట్ అవుతోంది.బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఎంత కాదనుకున్న కన్నాలక్ష్మీనారాయణను అలా అనేస్తే ఢిల్లీ పెద్దలకు కూడా గుస్సా రావచ్చు. ఇక విజయసాయిరెడ్డి మీద ప్రధాన మంత్రి ఆఫీస్ దృష్టి పెట్టిందందని బీజేపీ నేతలు అంటున్నారు. ఆయన అక్రమాలు, అవినీతి బాగోతాలు వెలికితీస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. విజయసాయిరెడ్డి అతి వినయాన్ని కూడా ఢిల్లీ పెద్దలు గమనిస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డి నోరు జారి చేస్తున్న కామెంట్స్ ఇపుడు వైసీపీకి, బీజేపీకి మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయి. ఇప్పటికైనా రెడ్డి గారు తగ్గకపోతే తనతో పాటు పార్టీని ఇబ్బందులో పెట్టేలా సీన్ కనిపిస్తోందని అంటున్నారు.
 

Related Posts